USA: అమెరికాలో మళ్ళీ మోగిన తుపాకులు–ఐదుగురు మృతి

అమెరికాలోని విస్కాన్సిన్‌లో మరొకపారి తుపాకులు మోగాయి.విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో ఉన్న అబండంట్‌ క్రిస్టియన్‌ స్కూల్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఐదుగురు చనిపోగా మరో ఐదుగురు గాయపడ్డారు.

New Update
usa

అమెరికాలో కాల్పులు మోత మోగింది. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో ఉన్న అబండంట్‌ క్రిస్టియన్‌ స్కూల్‌లో 12వ తరగతి విద్యార్ధి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే చనిపోయిన వారు విద్యార్ధులా లేదా స్కూలు సిబ్బందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.  

మాడిసన్‌లో ఉన్న అబండంట్ క్రిస్టియన్ స్కూల్లో మొత్తం 400 మంది విద్యార్​ధులు చదువుతున్నారు.   ఒక్కసారిగా కాల్పులు జరగడం, ఐదుగురు చనిపోవడంతో అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. విద్యార్ధులు భయంతో పరుగులు తీశారు. కాల్పులు జరిగిన సమాచారం అందుకున్న వెంటనే అక్కడ పోలీసులు వాహనాలు, అంబులెన్స్‌లు, ఫైరింజన్లు పాఠశాలను మోహరించాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులు జరిపిన విద్యార్థి సైతం చనిపోయిన వారిలో ఉన్నరని పోలీసులు అనుమానిస్తున్నారు.  అయితే విద్యార్థి ఎందుకు  ఈ పని చేశాడన్నది ఇంకా తెలియలేదు. 

ఏడాదిలో 322 ఘటనలు..

అమెరికాలో తుపాకులు మోత మోగడం చాలా సర్వసాధారణం అయిపోయింది. ఇక్కడ గన్ లైసెన్స్ ప్రతీ ఒక్కరికీ ఉండడమే దీనికి కారణం. ఇప్పుడు తాజాగా జరిగిన కాల్పులతో మరో సారి అగ్రరాజ్యంలో తుపాకీ సంస్కృతి, తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రత పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యూఎస్ లో సామాజికంగానే కాదు రాజకీయంగా కూడా ఇదో పెద్ద సమస్యగా తయారైంది. ఇప్పటి వరకూ ఎంత మంది అధ్యక్షులు మారుతున్నా ఈ తుపాకీ లైసెన్స్ చట్టాన్ని మాత్రం రద్దు చేయడం లేదు.  మరోసరి సీఠం ఎక్కుతున్న ట్రంప్ అయినా దీనికి ముగింపు పలుకుతారో లేదో చూడాలి. మరోవైపు అమెరికాలో కాల్పుల ఘటనలు రోజురోజుకూ ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 322 కాల్పులు ఘటనలు చోటు చేసుకున్నాయి. 

Also Read: Canada: ట్రూడోకు షాక్.. ఉప ప్రధాని రాజీనామా

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు