Canada: కెనడాలో వెయిటర్‌ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌, సర్వర్‌ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

canada
New Update

దూరపు కొండలు నునుపు అన్నట్లు...కన్నతల్లిని, ఉన్న దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్లిపోతున్నారు నేటి యువత. అక్కడికి వెళ్లిన వారంతా ఏదో సుఖంగా ఉన్నారని ఇక్కడి వారు అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే పరిస్థితులు దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయి. అది ఎలాగో ఈ సంఘటనే చెబుతుంది.

Also Read: ఊచకోతకు ఏడాది.. 365 రోజుల వినాశనం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్‌ రెస్టారెంట్‌లో వెయిటర్‌, సర్వర్‌ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను తెలియజేస్తుంది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.‘మేఘ్‌ అప్‌డేట్స్‌’ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో.. కెనడాలో చదువు, ఉద్యోగాలు కోరుకునే యువతకు ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుందన్న చర్చ మొదలైంది.

Also Read: ఇజ్రాయెల్‌ లో ఉద్రిక్త పరిస్థితులు..విమానాలు రద్దు చేసిన ఇరాన్‌!

Also Read: తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు..!

కొత్తగా ప్రారంభించబోయే రెస్టారెంట్‌ వెయిటర్‌, సర్వెంట్‌ జాబ్స్‌కు వేసిన అడ్వైర్టెజ్‌మెంట్‌కు వచ్చిన రెస్పాన్స్‌ ఇలా ఉందని ఆ వీడియోలో  చెప్పారు. ఎన్నో కలలతో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థులు మరోసారి ఆలోచించుకోవాలని ఈ వీడియో గట్టిగా చెబుతుంది. ఆర్థికమాంద్యం తరుముకొస్తున్న వేళ విదేశాలకు వెళ్లకపోవడమే బెటరని కొందరు సలహా ఇస్తున్నారు.

Also Read: చెన్నైలో విషాదం.. తొక్కిసలాటలో 100 మంది పైగా..

#canada #indian-students #waiter-jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe