BIG BREAKING : జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా సనే టకైచి

జపాన్ రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ దేశ ప్రధాని పదవిని అధిరోహించారు. కన్జర్వేటివ్ నాయకురాలు, చైనా పట్ల కఠిన వైఖరితో గుర్తింపు పొందిన సనాయే తకైచిని జపాన్ పార్లమెంట్ (డైట్) 2025 అక్టోబర్ 21వ తేదీన కొత్త ప్రధానిగా ఎన్నుకుంది

New Update
BREAKING

BREAKING

జపాన్ రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ దేశ ప్రధాని పదవిని అధిరోహించారు. కన్జర్వేటివ్ నాయకురాలు, చైనా పట్ల కఠిన వైఖరితో గుర్తింపు పొందిన సనాయే తకైచిని జపాన్ పార్లమెంట్ (డైట్) 2025 అక్టోబర్ 21వ తేదీన కొత్త ప్రధానిగా ఎన్నుకుంది. దీంతో జపాన్‌కు తొలి మహిళా ప్రభుత్వ అధినేతగా ఆమె చరిత్ర సృష్టించారు. 64 ఏళ్ల తకైచి, దేశ ఆర్థిక భద్రతా మంత్రిగా గతంలో పనిచేశారు.

మైనారిటీలో ఉన్న తమ పార్టీకి

అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (LDP)కి అధినేత్రిగా ఎన్నికైన తరువాత, మైనారిటీలో ఉన్న తమ పార్టీకి మిత్రపక్షమైన రైట్‌వింగ్ జపాన్ ఇన్నోవేషన్ పార్టీ (JIP) మద్దతుతో ఆమె ప్రధాని పీఠాన్ని దక్కించుకున్నారు. చైనా విషయంలో ఆమె దూకుడుగా వ్యవహరించే నాయకురాలిగా పేరు పొందారు. ఈ కారణంగానే, ఆమె నాయకత్వం చైనా, దక్షిణ కొరియాలతో దౌత్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 పార్లమెంట్‌లో మైనారిటీ ప్రభుత్వాన్ని నడపాల్సిన సవాల్‌తో పాటు, పెరుగుతున్న ధరలు, ఆర్థిక వృద్ధి మందగమనం వంటి క్లిష్ట సమస్యలను తకైచి తక్షణమే పరిష్కరించాల్సి ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం, ఆసియా ప్రాంతీయ సదస్సుల్లో పాల్గొనడం ఆమెకు తొలి అంతర్జాతీయ బాధ్యతల్లో ఉన్నాయి.

Advertisment
తాజా కథనాలు