రష్యా సంచలన నిర్ణయం.. త్వరలో 'మినిస్ట్రీ ఆఫ్ సెక్స్' శాఖ రష్యాలో గత కొన్నేళ్ల నుంచి రష్యాలో జనన-మరణాల రేటులో అంతరం భారీగా పెరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరిట ఓ కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన వచ్చింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 09 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి రెండేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం రష్యా ఓ కొత్త సవాలును ఎదుర్కొంటోంది. గత కొన్నేళ్ల నుంచి రష్యాలో జనన-మరణాల రేటులో అంతరం భారీగా పెరుగుతోందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యాలో మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ పేరిట ఓ కొత్త శాఖను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన వచ్చింది. కుటుంబ రక్షణకు సంబంధించిన పార్లమెంట్ కమిటీ ఇప్పుడు దాన్ని పరిశీలిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దేశంలో జనన-మరణాల రేటులో అంతరాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు అమలు చేయాలని అధక్షుడు పుతిన్ ఇచ్చిన పిలుపు మేరకు ఓ ఏజెన్సీ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. Also Read: ట్రంప్‌కు కాపలాకాస్తున్న రోబోటిక్ డాగ్స్.. జననాల రేటును పెంచే కార్యక్రమాలన్నీ కూడా ఈ శాఖ పరిధిలోనే ఉంచాలని ఈ ఏజెన్సీ పలు సూచనలు చేసింది. బంధాలను ప్రోత్సహించేందుకు, యువతకు ఫస్ట్ డేట్‌కు 5000 రూబెల్స్ ఇవ్వాలని చెప్పింది. ఇంటిపనులు, పిల్లలను చూసుకోవడం కోసం ఉద్యోగం మానేయాలనుకునేవాళ్లకి కొంత డబ్బు చెల్లించాలని సూచించింది. వీటితో పాటు మరికొన్ని ప్రతిపాదనలు కూడా చేసింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే జననాల రేటును పెంచేందుకు మహిళల వ్యక్తిగత వివరాలను అధికారులు సేకరిస్తున్నారని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. డేటా సేకరణ కోసం ప్రభుత్వ రంగానికి చెందిన మహిళా ఉద్యోగులకు ఫామ్స్ అందాయని.. అందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయని తెలిపాయి. జనన-మరణాల్లో అంతరం ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసుకుంటే రష్యాలో ఈ ఏడాది జూన్ వరకు 5,99,600 మంది పిల్లలు పుట్టారు. 2023 జూన్‌తో పోలిస్తే దాదాపు 16 వేల మంది పిల్లలు తక్కువగా పుట్టారు.1999 నుంచి రష్యాలో జననాల రేటు పడిపోతోంది. మరోవైపు 2024 జనవరి నుంచి జూన్ మధ్య 3,25,100 మరణాలు రికార్డయ్యాయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇవి 49 వేలు అధికం. అలాగే రష్యాకు వచ్చిన వలసదారుల జనాభా 20.1 శాతం ఉండటంతో ఈ క్షీణత కొంతవరకు భర్తీ అయ్యింది. Also Read: దద్దరిల్లిన రైల్వేస్టేషన్.. బాంబు పేలుడులో 26 మంది మృతి ఆ పురస్కారం పునరుద్ధన ఇదిలాఉండగా రష్యాలో జనాభా పెరిగేందుకు సోవియట్ కాలంలో అమల్లో ఉన్న ఓ పురస్కారాన్ని 2022లో పుతిన్ పునరుద్ధరించారు. 10, అంతకంటే ఎక్కువమంది పిల్లల్ని కనే మహిళలకు మిలియన్ రూబెల్స్ ( భారత కరెన్సీలో రూ.13 లక్షలకు పైన) నజరానా, అలాగే మదర్ హిరోయిన్ అవార్డును ఇస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటన చేసింది. 10వ బిడ్డ మొదటి పుట్టినరోజున ఈ నగదు చెల్లిస్తామని పేర్కొంది. అంతేకాదు అప్పటికీ మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలనే షరతును కూడా పెట్టారు. అయితే ఈ ప్రకటన వచ్చిన తర్వాత కూడా పెద్దగా మార్పు కనిపించలేదు. #telugu-news #russia #birth-rate మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి