రష్యా ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతుంది. డ్రోన్లు, మిస్సైల్స్‌తో భీకర దాడులు చేస్తోంది. 500 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. రెండు దేశా మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఇదే ఉక్రెయిన్‌పై జరిగిన అతిపెద్ద డ్రోన్ దాడి అని ఉక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది.
Clouds of smoke rise above Kyiv after Russia's night drone and missile attack, one of the largest ever on Ukraine's capital
— GMan (Ґленн) ☘️🇬🇧🇺🇦🇺🇸🇵🇱🇮🇱🍊🌻 (@FAB87F) June 10, 2025
7 city districts suffered damage, 4 people in the hospital. Former UK visa center got scorched, too.
📷 Suspilne, Ukrinform pic.twitter.com/XZ533G0iRS
తూర్పు, పశ్చిమ ఉక్రెయిన్‌లో 1000 కి.మీ మేరా దాడులు
ఇది చాలదు అన్నట్లు మరో 20 మిస్సైల్స్‌ను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది రష్యా. మిడిల్, వెస్ట్ ఉక్రెయిన్ టార్గెట్‌గా రష్యా దాడులకు దింగింది. తూర్పు, పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతంలో 1000 కిలోమీటర్ల వెంబడి దాడుల్ని రష్యా ఉద్ధృతం చేసింది. ఆ ప్రాంతాల్లో పరిస్థితి క్లిష్టంగా ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ అంగీకరించారు ఒకవైపు ఇరుదేశాల నడుమ ప్రత్యక్ష శాంతి చర్చలు జరుగుతుండగా రష్యా ఇంతటి తీవ్ర దాడికి తెగపడటం గమనార్హం. ఇప్పటివరకూ రష్యా దాడుల్లో 12 వేల మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు.
రష్యా దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులు మొదలుపెట్టింది. మస్కోపై భారీస్థాయిలో డ్రోన్లు, మిసైల్ దాడులతో జెలెన్‌స్కీ పుతిన్‌కు బిగ్ షాకిచ్చాడు. మాస్కోలో నాలుగు ప్రధాన ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడిని రష్యా రక్షణ శాఖ ధ్రువీకరించింది. 2 గంటల్లోనే 76 ఉక్రెయిన్ డ్రోన్‌లను నేలమట్టం చేసినట్లు రష్యా ప్రకటించింది.
latest-telugu-news | russia declares war on ukraine | russian ukraine war | russia strikes ukraine | russia drone attack | putin drone attack | russia attack ukraine