BIG BREAKING : చైనాలో ఘోర అగ్ని ప్రమాదం.. స్పాట్లో 22మంది మృతి!

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  లియోయాంగ్‌ నగరంలోని రెస్టారెంట్‌లో మధ్యాహ్నం 12:25 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా స్పాట్లో 22మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
china fire accident

china fire accident

చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.  లియోయాంగ్‌ నగరంలోని రెస్టారెంట్‌లో మధ్యాహ్నం 12:25 గంటల సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా స్పాట్లో 22మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, రెస్క్యూ బృందం సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇది రెండో ప్రమాదం

నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ప్రమాదం. ఏప్రిల్‌ 9న నార్త్‌ చైనాలోని   హెబీ ప్రావిన్స్‌లోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 20మంది వృద్ధులు మృతి చెందారు. ఇక మార్చిలో చైనాలోని ఉత్తర ప్రావిన్స్ హెబీలోని ఒక రెస్టారెంట్‌లో జరిగిన పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 26 మంది గాయపడ్డారు.  ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్పందించారు. ఈ ఘటనలో క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.   

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు