PM Modi, Zin Ping Meeting:
భారతదేశానికి అతి పెద్ద పోటీదారులలో చైనా ఒకటి. మనదేశానకి చైనా సరిహద్దు దేశం కూడా. ఆసియా దేశాల్లో అతి పెద్ద దేశం చైనా. ఆర్ధికంగా ప్రపంచంలో అన్ని దేశాలకంటే ఇది బలంగా ఎదుగుతోంది. దాంతో పాటూ చైనాకు , భారత్‌కు సరిహద్దు గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మనదేశంలోకి చొరబడాలని, మన ప్రాంతాలను ఆక్రమించాలని అటు పాకిస్తాన్, ఇటు చైనా ఇప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. చేసుకున్న ఒప్పందాలను పక్కన పెట్టి, రూల్స్ ను అతిక్రమించి చైనా భారత్‌లోకి చొరబడుతూనే ఉంటుంది. మనదేశంలోని అరుణాచల్ ప్రదేశ్‌ను ఆక్రమించాలని చూస్తూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో రష్యాలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
రష్యాలోని కజన్‌లో జరిగిన బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. సరిహద్దు గస్తీపై ఇరువురు నేతలు మరోసారి ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇంతకు ముందున్న ఒప్పందాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు. సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం ఇరు దేశాల ప్రాధాన్యంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఐదేళ్ల తర్వాత అధికారికంగా సమావేశం అయ్యాము. భారత్-చైనా సంబంధాలు ఇరు దేశాల ప్రజలకే కాకుండా ప్రపంచ శాంతి, సుస్థిరత, పురోగతికి ఎంతో ముఖ్యమని భావిస్తున్నామని మోదీ అన్నారు. నాలుగేళ్లుగా సరిహద్దులో తలెత్తిన సమస్యలపై ఇరు దేశాల నేతలూ ఒక అభిప్రాయానికి వచ్చామని తెలిపారు. కలిసిమెలిసి ఉండడానికి అంగీకారం తెలిపామని చెప్పారు. సరిహద్దులో శాంతి, సుస్థిరతను కాపాడుకోవడం ప్రాధాన్యంగా ఉండాలని ఇరువురు నేతలు అంగీకరించామని మోదీ తెలిపారు. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం అనేవి మన సంబంధాలకు ప్రాతిపదికగా ఉండాలని మోదీ అన్నారు. తామెప్పుడూ శాంతి మార్గాన్నే ఎంచుకుంటామని చెప్పారు.
ఐదేళ్ళుగా భారత్–చైనాల మధ్య చర్చలు జరగనే లేదు. ఎప్పుడు భారత్ ప్రయత్నించినా...చైనా అవకాశమివ్వలేదు. ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత ఎల్‌ఏసీ దగ్గర ఉన్న ఉద్రిక్తతకు ముగింపు పలుకుతూ ఇరు దేశాలు గస్తీ ఒప్పందానికి వచ్చాయి. కారణంగా ఈరోజు మోదీ, జి పింగ్‌ల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: T20: ఓవర్లు, 344 పరుగులు.. బాబోయ్ ఇదేం స్కోరు...ఇలా కూడా ఆడతారా..