అమెరికాలో విజృంభిస్తున్నహెలెన్..52మంది మృతి, 30 లక్షల మంది అంధకారంలో..

అమెరికాలో హరికేన్ హెలెన్ విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు 52 మంది మృతి చెందారు. దాంతో పాటూ అక్కడ విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిని...30 లక్షల మంది ప్రభావితమయ్యారు.

New Update
usa

Helen Hurrican: 

తీవ్రమైన హరికేన్ హెలెన్ అమెరికా ఫ్లోరిడా ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఈ పెను తుపాను ధాటికి ఇప్పటివరకు దాదాపు 52 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటంచారు. దీని కారణంగా ఆగ్నేయ అమెరికాలో బిలియన్ల డాలర్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. స్టేట్‌లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు 30 లక్షల మంది ప్రభావితమైనట్లు అధికారులు చెప్పారు. వరద ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదని..వరద ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

ఫ్లోరిడా, జార్జియా, నార్త్‌ కరోలినా, సౌత్‌ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో కేటగిరి- 4 ‘హెలెన్‌’ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఫ్లోరిడాలో తుపాను తీరం దాటేటప్పుడు గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీచాయి.  జార్జియా, సౌత్‌ కరోలినా, నార్త్‌ కరోలినా, టెనస్సీ గుండా సాగిన హరికేన్‌ ధాటికి వేలాది చెట్లు కూలిపోయాయి. ఇళ్లు ధ్వంసమయ్యాయి.

Also Read: Cricket: బంగ్లాదేశ్‌తో టీ20 సీరీస్ కు భారత జట్టు ప్రకటన

Advertisment
తాజా కథనాలు