BIG BREAKING: కుప్పకూలిన ఫైటర్ జెట్.. స్పాట్‌లోనే పైలట్ మృతి!

సెంట్రల్ పోలాండ్‌లోని రాడోమ్‌లో వైమానిక ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్న సమయంలో పోలిష్ వైమానిక దళానికి చెందిన F-16 ఫైటర్ జెట్ నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఒక పోలిష్ ఆర్మీ పైలట్ మృతి చెందాడు.

New Update
Fighter jet

Fighter jet

సెంట్రల్ పోలాండ్‌లోని రాడోమ్‌లో వైమానిక ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్న సమయంలో పోలిష్ వైమానిక దళానికి చెందిన F-16 ఫైటర్ జెట్ నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ఒక పోలిష్ ఆర్మీ పైలట్మృతి చెందాడు.  విమానం రన్‌వేపై కూలిపోయి దెబ్బతిందని తెలుస్తోంది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన విమానం పోజ్నాన్ సమీపంలోని 31వ టాక్టికల్ ఎయిర్ బేస్‌కు చెందినది. ఈ ప్రమాద ఘటనలో పక్కన ఉన్నవారు ఎవరూ గాయపడలేదని సాయుధ దళాల జనరల్ కమాండ్ తెలిపింది. పైలట్‌ను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అతను మృతి చెందినట్లు సాయుధ దళాల జనరల్ కమాండ్ వెల్లడించింది.

ఇది కూడా చూడండి: Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 598 డ్రోన్లతో కాల్పులు

సాంకేతిక కారణాల వల్ల..

ఈ ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే పైలట్‌ను రక్షించే ప్రయత్నం విఫలమైంది. అప్పటికే పైలట్ మృతి చెందాడు. మరణించిన పైలట్ పోలిష్ ఆర్మీకి చెందినవాడని సాయుధ దళాల జనరల్ కమాండ్ తెలిపింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. సాంకేతిక లోపం కారణంగా ఇది జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ విషాద ఘటన పట్ల పోలాండ్ రక్షణ శాఖ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. మరణించిన పైలట్ కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేసింది.

ఇది కూడా చూడండి: India-Canada: భారత్, కెనడాల స్నేహ హస్తం..కెనడాకు భారత హైకమిషనర్‌గా దినేశ్‌ కె.పట్నాయక్‌ నియమకం

Advertisment
తాజా కథనాలు