Vinesh Phogat: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కేసులో భారత ప్రభుత్వం మద్దతుగా నిలవలేదంటూ వినేశ్ కేసు డీల్ చేసిన అడ్వకేట్ హరీశ్ సాల్వే చెప్పారు. అంతేకాదు కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్) తీర్పును సవాల్ చేయడానికి వినేశ్ కూడా సుముఖత వ్యక్తం చేయలేదని హరీశ్ తెలిపారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇష్యూ గురించి మాట్లాడిన న్యాయవాది.. ‘కాస్‌లో ఈ కేసును నిజానికి దేశం పేరుతో చేయాల్సినప్పటకీ నా పేరు మీద ఫైల్ చేశాను. ప్రభుత్వం, ఐవోఏ నుంచి నాకు మద్దతు లభించలేదు. మెడల్‌ను పెద్దగా పట్టించుకోలేదు. మేమంతా దేశం కోసం పోరాడుతున్నపుడు ప్రభుత్వం నుంచి పెద్దఎత్తున సపోర్టు ఉండాల్సింది. కానీ పెద్దలంతా మీడియా ముందు హైలెట్ అయ్యే పనిలో ఉన్నారు. థర్డ్ పార్టీగానే కాస్‌లో వాదనలు వినిపించినప్పటికీ ఫలితం దక్కలేదు' అని వివరించారు.
ఇక పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరిన వినేశ్ రజతం ఖాయం చేసుకుంది. కానీ, ఫైనల్‌కు ముందు 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. దీనిని సవాలు చేస్తూ కాస్‌ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.