/rtv/media/media_files/2025/09/14/asia-cup-india-vs-pakistan-2025-09-14-18-24-47.jpg)
India vs Pakistan
India vs Pakistan : టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌పై పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. ఐసీసీ, శ్రీలంక, యూఏఈ ఒత్తిడితో పీసీబీ తన బహిష్కరణ నిర్ణయాన్ని మార్చుకుంది. జై షా మైండ్ గేమ్ తో పాకిస్థాన్ ను దారిలోకి తెచ్చారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల మధ్య పోరు జరిగేనా అనే ఉత్కంఠకు ఎట్టకేలకూ తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హై-వోల్టేజ్ మ్యాచ్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అనూహ్య నిర్ణయం తీసుకుంది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ గత పది రోజులుగా భీష్మించుకు కూర్చున్న పాక్, ఇప్పుడు తన పంతాన్ని వీడి వెనక్కి తగ్గింది. భారత్-పాక్ మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని స్పష్టమైంది. అయితే, పాకిస్థాన్ స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పన్నిన పక్కా వ్యూహం వల్లే పీసీబీ తలవంచక తప్పలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
అంతకు ముందు పాకిస్తాన్ నుంచి వచ్చిన 3 ప్రధాన డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది. ఇందులో ముఖ్యంగా భారత్ - పాకిస్తాన్ సిరీస్, ట్రై-సిరీస్, టీమిండియా బంగ్లాదేశ్ పర్యటనను అంగీకరించడానికి ఐసీసీ నిరాకరించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మధ్య జరిగిన సమావేశం అనంతరం క్రికెట్ స్ఫూర్తిని కొనసాగించే ఉద్దేశంతో తమ జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు పాక్ ప్రభుత్వం తెలిపింది.
కాగా ఐసీసీ, పీసీబీ, బీసీబీ ఆదివారం లాహోర్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఐసీసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు సఫలమయ్యాయి. నిర్మాణాత్మక ఒప్పందాలు, ఐకమత్యంగా ముందుకు సాగటం, క్రికెట్ అత్యుత్త ప్రయోజనాలు.. సమగ్రత, నిబద్ధత, పరస్పర సహకారం.. తదితర అంశాల ఆవశ్యకతను గుర్తించిన ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించింది. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసేందుకు.. ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనే నిబంధనల పట్ల అన్ని బోర్డులు గౌరవభావంతో ఉన్నాయి. క్రికెట్ స్ఫూర్తితో ముందుకు సాగాలని సభ్య దేశాలు నిర్ణయించాయి. ఇక బంగ్లాదేశ్ విషయంలోనూ మా వైఖరి మారలేదు తెలిపింది.
ఎలాంటి ప్రభావం ఉండదు
200 మిలియన్లకు పైగా క్రికెట్ అభిమానులు ఉన్న పెద్ద మార్కెట్లో ఆట అభివృద్ధికి ఐసీసీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తున్నాం. ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నందుకు ఆ జట్టుపై దీర్ఘకాలంలో ఎలాంటి ప్రభావం ఉండదని హామీ ఇస్తున్నాం.అదే విధంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఎలాంటి పెనాల్టీలు విధించడం లేదు. అంతేకాదు.. ఐసీసీ ఈవెంట్ల ఆతిథ్య ప్రక్రియ, అందుకు తగిన ప్రమాణాలు కలిగి ఉంటే.. తప్పక 2031 పురుషుల క్రికెట్ వరల్డ్‌కప్ కంటే ముందు జరిగే ఐసీసీ టోర్నీకి వేదికగా బంగ్లాదేశ్‌కు అవకాశం ఉంటుంది’’ అని ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది.
Follow Us