/rtv/media/media_files/2025/04/24/znxORU2mn8yABI0vnsuy.jpg)
pak-water
పహల్గాంలో ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని గుర్తించిన భారత్.. పాక్ తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. అయితే దీనిపై తాజాగా పాకిస్థాన్ స్పందించింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించింది. సింధు జలాల్లోని ప్రతీ నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్.
భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా, దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడమంటే యుద్ధం ప్రకటించడమేనన్నారు. ప్రపంచ బ్యా్ంకు వంటి సంస్థలు కుదుర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు. సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనం, చట్టవిరుద్ధమైన చర్య అని పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవాయిస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీ్ట్ చేశారు.
India’s reckless suspension of the Indus Waters Treaty is an act of water warfare; a cowardly, illegal move. Every drop is ours by right, and we will defend it with full force — legally, politically, and globally.
— Awais Leghari (@akleghari) April 23, 2025
1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో
సింధు జలాల ఒప్పందం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది. సింధూ నది టిబెట్లో పుట్టి.. భారత్, పాక్ మీదుగా 3 వేల 180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా ఆరు ఉపనదులు కూడా కలుస్తుంటాయి. దేశ విభజన అనంతరం సింధు జలాల నిర్వహణపై భారత్, పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాల్లో చాలా విషయాల్లో వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేశారు.