పహాల్గాంలో జరిగిన ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ తన కవ్వింపు చర్యలతో ఈ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోస్తోంది. తాజాగా పాక్ మరో క్షిపిణి ప్రయోగాన్ని చేపట్టింది. పాకిస్తాన్ తన ఫతా సిరీస్ ఉపరితలం నుండి120 కిలోమీటర్ల రేంజ్ లో చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం అయినట్లుగా తెలిపింది. వాస్తవానికి ఈ క్షిపణి దాని బలహీనతకు చిహ్నంగా మారింది. కేవలం 120 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణిని చూసి భారత్ ఏ మాత్రం ఆశ్చర్యపోదు. ఎందుకంటే భారత్ కు సంబంధించి అతి తక్కువ పరిధి గల క్షిపణి కూడా దీని కంటే ముందుంది. దీనిబట్టి చూస్తే పాకిస్తాన్ తన బలాన్ని ప్రదర్శించడానికి అత్యంత అసమర్థమైన ఆయుధాన్ని ఉపయోగించింది. మూడు రోజుల క్రితం పాకిస్తాన్ అబ్దాలి ఆయుధ వ్యవస్థను పరీక్షించింది. ఈ క్షిపణి 450 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంది. అటు గత 10 రోజుల్లో పాకిస్తాన్ సైన్యం నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద అనేకసార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది.
Pakistan today conducted a successful training launch of a FATAH Series surface-to-surface missile with a range of 120 kilometers as part of ongoing Ex INDUS. pic.twitter.com/hPf1SCJ3t8
— Directorate of Electronic Media and Publications (@demp_moib) May 5, 2025