మాతో పెట్టుకుంటే విధ్వంసం తప్పదు.. కిమ్ అణ్వాయుధాలు హెచ్చరిక

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దక్షిణ కొరియాకి హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశంపై దక్షిణ కొరియా దాడి చేస్తే అణ్వాయుధాలతో విధ్వంసం సృష్టిస్తామని ఆ దేశ అధ్యక్షుడిని హెచ్చరించినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి.

kim
New Update

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దక్షిణ కొరియాకి హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర కొరియా ఎప్పటికప్పుడు క్షిపణులు, శక్తివంతమైన బాంబు పరీక్షలు, సూసైడ్ డ్రోన్ వంటి వాటిలో దేశ ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది. అయితే ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సంబంధాలు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈక్రమంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తమ దేశంపై దాడి చేస్తే దక్షిణ కొరియాపై అణ్వాయుధాల దాడి చేస్తామని హెచ్చరించినట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. 

ఇది కూడా చూడండి: ప్రతిరోజూ షేవ్ చేయడం ప్రమాదకరమా? చేస్తే ఏమవుతుంది.?

అమెరికాతో కలిసి..

శత్రు దేశాలు తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించేలా దాడులకు పాల్పడితే ఎలాంటి ఆలోచన లేకుండా అణ్వాయుధాలతో దేశంపై విరుచుకుపడతామని దక్షిణ కొరియాకి కిమ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఉత్తర కొరియా దాడి చేసిన వెంటనే ఆ దేశం పాలన ముగుస్తుందని.. అమెరికాతో కలిసి దాడి చేస్తామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ వాఖ్యానించారు. దీనికి బదులగా కిమ్‌ ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: నేడు గాయత్రీ అవతారంలో దుర్గమ్మ.. ప్రత్యేకత ఇదే!

#north-korea
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe