దక్షిణ కొరియా రచయిత్రి హాన్‌కాంగ్.. సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఆమెకు ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం వరించింది. మానవ జీవిత దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను హాన్‌కాంగ్ కళ్లకు కట్టినట్లు చూపించారని స్విడీష్ అకాడమీ తెలిపింది. గత ఏడాది నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసె నోబెల్ బహుమతి అందుకున్నారు.
Also Read: వణుకుతున్న అమెరికా.. హరికెన్ మిల్టన్‌తో ముప్పు
ఇదిలాఉండగా.. ఇటీవల వైద్య విభాగంతో ప్రారంభమైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. వైద్య విభాగంతో పాటు భౌతి, రసాయన శాస్త్రాల్లో నోబెల్ గ్రహితల పేర్లు ఇప్పటికే వెల్లడించారు. గురువారం సాహిత్యంలో నోబెల్ విజేతను ప్రకటించగా.. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి, అలాగే అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రహీతల పేర్లను ప్రకటించనున్నారు.
Also Read: మెషీన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు.. భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్