Russia: భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడతాం–పుతిన్

ఇండియాలో పెద్ద మొత్తంలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని.. త్వరలోనే భారీగా పెట్టుబడులు పెడతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన మేక్ ఇన్ ఇండియా పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

New Update
11

మాస్కోలో జరిగిన పెట్టుబడుల సదస్సులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు. దీనిలో భారత్‌లో మొదీ అవలంబిస్తున్న ఇండియా ఫస్ట్ కాన్సెప్ట్ మీద ప్రశంసలు కురిపించారు. మేక్ ఇన్ ఇండియా నిర్ణయం భారతదేశాన్ని ప్రపంచంలో ఎలా నిలబెట్టిందో చెప్పుకొచ్చారు. ఇలాంటివి దేశాభివృద్ధికి ఎంత దోహదం చేస్తాయో...మోదీ దీన్ని ఎంత బాగా అభివృద్ధి చేశారో వివరించారు పుతిన్. మోదీని పొగడ్తల్లో ముంచిపడేశారు. 

మేక్ ఇన్ ఇండియా సూపర్..

మేక్ ఇన్ ఇడియా తనను ఎంతగానో ఆకర్షించిందని..అందుకే భారత్‌లో పెట్టుబడులు పెడదామని నిర్ణయించుకున్నామని తెలిపారు పుతిన్. త్వరలోనే తయారీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మోడీ నేతృత్వంలో పెట్టుబడులకు భారత్‌ స్వర్గధామంగా మారిపోయిందన్నారు. ఆయన తీసుకొచ్చిన ఇండియా ఫస్ట్‌ విధానం వల్ల ఇండియా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడం చాలా లాభదాయకమని.. అందుకే రష్యాకు చెందిన రోస్నెఫ్ట్‌ భారత్‌లో ఇప్పటికే 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టిందని రష్యా అధ్యక్షుడు తెలిపారు. భారత ప్రజల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం   చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడం ఎంతో మంచి విషయమని పుతిన్ అన్నారు. ఇటీవల జరిగిన బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులోనూ రష్యా అధ్యక్షుడు ఈ అంశాన్ని లేవనెత్తారు. MSMEల అభివృద్ధికి సపోర్టు ఇవ్వాలని బ్రిక్స్‌ సభ్య దేశాలను కోరారు. ఎంఎస్‌ఎంఈల స్థాపనకు ఏయే రంగాలు అనుకూలంగా ఉంటాయో గుర్తించాలన్నారు.

Also Read: Bangladesh: షేక్ హసీనా ప్రసంగాలపై బంగ్లాదేశ్‌లో నిషేధం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు