హెజ్బుల్లా కొత్త చీఫ్‌గా నస్రల్లా వారసుడు నయీం ఖాసీం లెబనాన్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థ కొత్త చీఫ్‌గా నయీం ఖాసీమ్‌ను నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటనను మంగళవారం విడుదల చేసింది. By Seetha Ram 29 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. నువ్వా.. నేనా అన్నట్లు రాకెట్లు, క్షిపణులతో భీకర దాడులకు దిగుతున్నాయి. ఇరాన్ పది రాకెట్లు ప్రయోగిస్తే.. ఇజ్రాయెల్ ఇరవై రాకెట్లు ప్రయోగిస్తుంది. ఇలా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. ఈ యుద్ధంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరెందరో తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కు బిక్కుమని గడుపుతున్నారు. ఇది కూడా చూడండి: ధంతేరాస్ స్పెషల్.. 10 నిమిషాల్లో బంగారం, వెండి డెలివరీ ఇందులో భాగంగానే ఇటీవల ఇరాన్ క్షిపణి వ్యవస్థపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఘన ఇందన మిశ్రమాన్ని తయారు చేసే కేంద్రాలను ఇజ్రాయెల్ విమానాలు ధ్వంసం చేశాయి. ఈ దాడిలో డజనుకి పైగా కేంద్రాలు నేలమట్టమయ్యాయి. వీటితో పాటు టెహ్రాన్‌లోని ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను సైతం ఇజ్రాయెల్ దెబ్బతీసింది. ఇంకా పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లో డ్రోన్ల తయారీ యూనిట్‌ని కూడా ధ్వంసం చేసింది. ఇది కూడా చూడండి: వీధిన పడ్డ ఉద్యోగులు.. రెచ్చిపోయిన సోమిరెడ్డి..! ఇందులో మూడు భవనాలు దెబ్బతిన్నట్లు ఇరాన్ గుర్తించింది. అంతేకాకుండా మరోవైపు ఇజ్రాయెల్, హెజ్బుల్లాపై సైతం దాడులను ఫుల్‌స్టాప్ పెట్టలేదు. రీసెంట్‌గానే గాజాపై మరోసారి విరుచుకుపడింది. 10 భారీ అపార్ట్‌మెంట్స్‌పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 55 మంది పాలస్తీనియన్లు అక్కడికక్కడే మృతి చెందగా.. వందల మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఇది కూడా చూడండి: ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ హెజ్బుల్లా కీలక నిర్ణయం ఈ నేపథ్యంలో హెజ్బుల్లా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హెజ్బుల్లా కొత్త చీఫ్‌గా హసన్ నస్రల్లా వారసుడు షేక్ నయీం ఖాసీంను నియమించింది. ఈ మేరకు ఓ ప్రకటనను మంగళవారం రిలీజ్ చేసింది. కాగా సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ దాడుల్లో హసన్ నస్రల్లా ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఇప్పుడు హెజ్బుల్లా కొత్త చీఫ్‌గా ఆయన కుమారుడిని నియమించారు. కాగా ప్రస్తుతం షేక్ నయీం ఖాసీం యుద్ధంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇది కూడా చూడండి: ఆలయంలో పేలిన బాణాసంచా.. 150 మందికి పైగా గాయాలు వ్యూహకర్తగా నయీం ఖాసీంకు మంచిపేరు అంతేకాకుండా వ్యూహకర్తగా నయీం ఖాసీంకు మంచిపేరు ఉంది. అంతకుముందు హెజ్బుల్లా డిప్యూటీ జనరల్‌గా కూడా ఖాసీం పనిచేశారు. ఇక ఖాసీం చీఫ్ కావడంతో ఆయన నేతృత్వంలో యుద్ధం మరింత తీవ్రంగా మారే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక తమదేశంపై దాడులకు దిగిన ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇప్పటికే ఇరాన్ ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇరాన్, ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడులకు దిగింది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని, హెజ్బుల్లా నూతన చీఫ్ షేక్ నయీం కలిసి ఇజ్రాయెల్‌పై భారీ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. #israel-attack #iran-attack మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి