USA: ట్రంప్ ర్యాలీలో పాల్గొన్నవారికి వింత జబ్బు?

ఒకపక్క అమెరికా అధ్యక్ష పదవి రేస్‌లో ఉన్న ట్రంప్‌ మీద వరుస హత్యాప్రయత్నాలు జరుగుతున్నాయి మరోవైపు ట్రంప్ ర్యాలీలో పాల్గొన్న మద్దతు దారులు వింత రోగాలబారిన పడుతున్నారు. దీంతో ట్రంప్ ర్యాలీలో రసాయన దాడి జరిగిందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

New Update
US Presidential Election: డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్...అధ్యక్ష పదవికి అనర్హుడని ప్రకటించిన కోర్టు...!!

Trump Supporters: 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ట్రంప్ ప్రతీ స్టేట్ చుట్టేస్తున్నారు. రీసెంట్‌గా రిజోనాలోని టక్సన్ అనే ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన మద్దతు దారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇందులో కొంతమంది వింత అనారోగ్యానికి పాలయ్యారు. దాదాపు 20 మందికి కంటి, చర్మసంబంధిత సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా వేదిక వెనుకవపు కూర్చున్న వారికి ఎక్కువగా...అది కూడా ర్యాలీ ముగిసిన కొన్ని గంటల్లోనే అనారోగ్యం వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ట్రంప్ ప్రచారంలో రసాయన దాడి జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. కానీ బాధితుల రియాక్షన్స్ మాత్రం కెమిల్ దాడిలానే కనిపిస్తోంది. ట్రంప్ మీద వరుస దాడుల ప్రయత్నాల నేపథ్యంలో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. 

ఇక అనారోగ్యం బారిన పడిన వారికి కంటిచూపు మసకబారడం, ముఖం ఉబ్బిపోవడం, తీవ్రమైన మగత వంటి లక్షణాలు కన్పించాయని వార్తా కథనాలు వచ్చాయి. కొందరు ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తింది. వీరి అనారోగ్యం గురించి తెలుసుకున్న ట్రంప్‌ ప్రచార బృందం బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. కానీ దీనిపై ఇంకా ఇప్పటికీ స్పష్టమైన సమాచారం లేదు. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మరింత జాగ్రత్తగా ర్యాలీలు ఏర్పాటు చేస్తామని ట్రంప్‌ బృందం హామీ ఇచ్చింది.

Also Read: రేప్ చేసినట్లు నిరూపిస్తే..నేనే వదిలేస్తా–జానీ మాస్టర్ భార్య

Advertisment
తాజా కథనాలు