Volcano Eruption: బద్దలైన అగ్నిపర్వతం.. అక్కడి ప్రజలకు హై అలెర్ట్!

ఇండోనేషియాలో ని లెవోటోబి లకి-లకిలోని అగ్ని పర్వతం సోమవారం ఉదయం మరోసారి బద్దలైంది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. అగ్నిపర్వతం చుట్టూ 6 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను ఖాళీ చేయాలని, ఎవరూ ఆ పరిధిలోకి వెళ్లరాదని అధికారులు సూచించారు.

New Update
Indonesia Mount Lewotobi volcanic eruption

Indonesia Mount Lewotobi volcanic eruption

Indonesia: ఇండోనేషియాలోని ఫ్లోరెస్ దీవిలోని  Mount Lewotobi Laki-laki అగ్నిపర్వతం ఈరోజు ఉదయం మరోసారి  బద్దలైంది.  గత వారంలోనే  ఎనిమిది సార్లు విస్ఫోటనానికి గురైంది. ఈరోజు  1.2 కిలోమీటర్ల ఎత్తులో బూడిదను వ్యాపింపజేసింది. దీంతో అక్కడి  అక్కడి అధికారులు హై అలెర్ట్ జారీ చేశారు. మరిన్ని విస్ఫోటనాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. 

5.5 కిలోమీటర్ల ఎత్తు

ఆదివారం రోజు  3 కిలోమీటర్ల నుంచి 5.5 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలను వ్యాపింపజేసింది. ఈ విషయాన్ని ఇండోనేషియా వల్కనాలజీ ఏజెన్సీ చీఫ్ ముహమ్మద్ వాఫిద్  వెల్లడించారు. విస్ఫోటనం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి అలర్ట్ లెవెల్‌ను పెంచినట్లు  చెప్పారు.

అధికారులు విడుదల చేసిన ఫొటోల్లో..  గాఢ బూడిద మేఘాలు, అగ్నిపర్వత క్రేటర్ నుంచి బయటకి పొంగిపోతున్న దృశ్యాలు కనిపించాయి. అగ్నిపర్వతానికి సమీపంలో ఉన్న మానిటరింగ్ కేంద్రానికి విపరీతమైన శబ్దాలు వినిపించాయని అధికారులు  పేర్కొన్నారు. అగ్నిపర్వతం చుట్టూ 6 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను ఖాళీ చేయాలని, ఎవరూ ఆ పరిధిలోకి వెళ్లరాదని అధికారులు సూచించారు.

ఇప్పటి వరకు ఎలాంటి ఎవాక్యుయేషన్,   లేదా విమాన రద్దులు జరగలేదని, స్థానిక అధికారుడు హెరోనిమస్ లమావురాన్ చెప్పారు. ఒకవేళ ఈ సమయంలో వర్షాలు పడితే చుట్టు పక్కన ప్రాంతాలకు సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2023 నవంబర్‌లో, ఈ అగ్నిపర్వతం పెద్ద మొత్తంలో బూడిద వ్యాపింపజేయడంతో  9 మంది మృతి చెందారు.  వేలాది సంఖ్యల్లో  స్థానికులను  వేరే ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది.

telugu-news | latest-news | Indonesia Volcano | Volcanic Eruption | Lewotobi Laki Laki 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు