Modi : ప్రవాస భారతీయులంతా అంబాసిడర్లే...మోదీ ప్రశంసలు! న్యూయార్క్ వేదికగా నిర్వహించిన 'మోదీ అండ్ యూఎస్' కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ప్రవాస భారతీయులను ఇరు దేశాల అనుసంధానకర్తలుగా అభివర్ణించారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వ విజయాలను వివరించారు. By Bhavana 23 Sep 2024 | నవీకరించబడింది పై 23 Sep 2024 10:07 IST in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి PM Modi : ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ దేశానికి బలమైన, నిజమైన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలోని భారతీయుల నైపుణ్యాలు, నిబద్ధత సాటిలేనివనిఈ సందర్భంగా కితాబిచ్చారు. ప్రవాస భారతీయులు ఇరుదేశాలను అనుసంధానించినట్లు చెప్పుకొచ్చారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూయార్క్ వేదికగా నిర్వహించిన 'మోదీ& యూఎస్- ప్రోగ్రెస్ టుగెదర్' అనే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. తాను ఎటువంటి పదవుల్లో లేని సమయంలోనే అమెరికాలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించినట్లు ప్రధాని మోదీ ఈ వేదిక సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రధానిగా అమెరికా పర్యటనల్లో భాగంగా ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాలను గురించి మోదీ ప్రస్తావించారు. ఇక్కడి భారతీయులు ప్రతిసారీ పాత రికార్డులను తిరగరాశారని మోదీ అభినందించారు. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రోగ్రాంకు ఎన్ఆర్ఐలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవీశ్రీ ప్రసాద్ తదితరులు తమ ప్రదర్శనలతో వచ్చిన వారికి కనువిందు చేశాడు. ప్రధాని మోదీ ఈనెల 23న న్యూయార్క్‌లోని ఐరాస జనరల్ అసెంబ్లీలో 'సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్'నుద్దేశించి ప్రసంగించబోతున్నారు. Also Read : మమ్మల్ని క్షమించండి.. అభిమానులకు తారక్ సారీ! #pm-modi #usa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి