అందం అంటే కాన్ఫిడెన్స్.. బొల్లి వ్యాధి ఉన్నప్పటికీ మిస్ యూనివర్స్ పోటీకి ఎంపికైన భామ! ఈజిప్ట్‌కు చెందిన లోజినా సలా బొల్లి వ్యాధితో బాధపడుతున్నప్పటికీ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొని చరిత్ర సృష్టించింది. బొల్లి వ్యాధి ఉన్నప్పటికీ అందాల పోటీల్లో టాప్ 30కి చేరిన ఘనత సాధించింది. By Archana 19 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update miss universe 2024: Logina Salah షేర్ చేయండి Miss Universe 2024 : మనలో మనకు కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించవచ్చని.. మన వంతు ప్రయత్నం గట్టిగా చేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలుగా మారతాయని అనడానికి ఈమె నిదర్శనం. ఈజిప్ట్‌కు చెందిన లోజినా సలా బొల్లి వ్యాధితో(చర్మ వ్యాధి) బాధపడుతున్నప్పటికీ తన అందాల పోటీల్లో పాల్గొని ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె కాన్ఫిడెన్స్, పట్టుదల ఈరోజు ఆమెను అందరు గర్వించేలా చేసింది. మిస్ యూనివర్స్ పోటీల్లో బొల్లి వ్యాధి ఉన్నప్పటికీ.. నవంబర్ 17న మెక్సికో వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో చరిత్ర సృష్టించింది. అందాల పోటీలో టాప్ 30కి చేరుకొని అరుదైన ఘనత సాధించింది. అమ్మాయిలకు అసలైన అందం ఆత్మవిశ్వాసం అని నిరూపించింది. మిస్ యూనివర్స్ చరిత్రలో బొల్లి వ్యాధితో పాల్గొన్న తొలి కంటెస్టెంట్ లోజినా సలా. ఆమె కృషి, పట్టుదల చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. Also Read : ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి! View this post on Instagram A post shared by Miss Universe Egypt (@missuniverse.egypt) Also Read : విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించండి.. బ్రిటన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి బొల్లి వ్యాధి అంటే ఏమిటి బొల్లి వ్యాధి అనేది ఒక చర్మ వ్యాధి. ఇందులో శరీరంలోని కొన్ని భాగాలలో చర్మం పై తెల్లటి మచ్చలు, ప్యాచెస్ ఏర్పడతాయి. చర్మం సహజ రంగును కోల్పోతుంది. ఈ వ్యాధి ఏ వయసులోనైనా వచ్చే అవకాశం ఉంది. చర్మంతో పాటు ఈ బొల్లి వ్యాధి ప్రభావం వెంట్రుకలు, కళ్ళు, నోటి లోపల కూడా ఉంటుంది. దీనిని ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధిగా చెబుతారు. అయితే ఈ వ్యాధికి గల కారణాలు ఖచ్చితంగా తెలియరాలేదని వైద్యులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Logina Salah (@loginasalah) Also Read: టాయిలెట్ పై కూర్చొని గంటలు గంటలు గర్ల్ ఫ్రెండ్ తో సొల్లేస్తున్నారా..? జాగ్రత్త Also Read: గుండెలను పిండేసే దృశ్యం.. ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి..! కూతుర్లు ఏం చేశారో చూడండి #logina-salah #telugu-news #miss-universe-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి