/rtv/media/media_files/2024/10/23/RtAoZPEtALdajoz3yS9x.jpg)
ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి టర్కీలోని అంకార సమీపంలోని టర్కీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TUSAS) హెడ్‌క్వార్టర్స్ వద్ద ఉగ్రకాల్పులు చోటుచేసుకున్నాయి. ఆ ప్రాంతంలో భారీ పేలుడు జరిగింది. అలాగే ఉగ్రవాదులు తుపాకులతో కాల్పులు కూడా చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ ఘటనపై టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికయా ఎక్స్ వేదికగా స్పందించారు.
Also Read: మరో యుద్ధానికి సిద్ధం... రష్యా గడ్డపై నార్త్ కొరియా బలగాలు!
'' అంకర వద్ద కహ్రమంకజాన్‌లోని టర్కీస్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌పై ఉగ్రకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయాలపాలయ్యారని'' పేర్కొన్నారు. అయితే ఈ భారీ పేలుడు జరగడం, తుపాకుల కాల్పులకు గల కారణమెంటో ఇంతవరకు తెలియలేదు. అయితే అక్కడ ఆత్మహుతి దాడి చేసుకున్నట్లు పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
🚨SUICIDE BOMB ATTACK HITS TURKISH AEROSPACE FACILITY IN ANKARA
— Mario Nawfal (@MarioNawfal) October 23, 2024
A suicide bomb targeted the entrance of the Turkish Aerospace Industries (TAI) facility in Kazan, Ankara, leading to multiple injuries and fatalities.
Following the explosion, a clash broke out between attackers… https://t.co/7HPcm0mupX pic.twitter.com/Ifvt9zdhg6
🚨Turkey's interior minister has confirmed a terrorist attack on the Turkish Aerospace Industries (TAI) facilities in Kahramankazan, Ankara.
— BigBreakingWire (@BigBreakingWire) October 23, 2024
There are reports of casualties and injuries as a result of the attack. pic.twitter.com/YAhpRHBjD7
ఇదిలా ఉండగా 2023లో కూడా అంకరాలోని అంతర్గత మంత్రిత్వశాఖ బిల్డింగ్‌ల ఎదుట ఇద్దరు ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ పేలుడు దాటికి వాళ్లలో ఒకరు చనిపోగా మరోకరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక 2016లోనే సిరియా సరిహద్దు ప్రాంతంలో ఉన్న టర్కిష్ పట్టణంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకలో కూడా ఆత్మహుతి దాడులు జరిగాయి. ఈ పేలుళ్ల దాటికి 50 మంది ప్రాణాలు కోల్పోయార. మరో 100 మందికి పైగా గాయాలపాలయ్యారు.