Lunar Eclipse : నేడు ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే భారత్‌పై దీని ప్రభావం ఎంత..? ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా..? చంద్రగ్రహణం భారతదేశంలో చెల్లుబాటు అవుతుందా లేదా..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సెప్టెంబరు 18 చంద్రగ్రహణం ఉదయం 06:12 నుండి 10:17 వరకు ఉంటుంది. సంవత్సరంలో రెండవ చంద్ర గ్రహణం భారతదేశంలో పెద్దగా కనిపించదు. ఈ చంద్రగ్రహణం దక్షిణ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, పశ్చిమ యూరప్ దేశాల్లో కనిపించనుంది. ఇది కాకుండా హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, అంటార్కిటికాలోని కొన్ని ప్రదేశాలలో కూడా ఈ గ్రహణం కనిపించనున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
చంద్రగ్రహణం ప్రారంభానికి 9 గంటల ముందు సూతక్ కాల్ ప్రారంభమవుతుంది. కానీ భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించనప్పుడు దాని సూతక్ కాలం కూడా చెల్లదు. సెప్టెంబర్ 18 చంద్రగ్రహణం భారతదేశంలో కూడా కనిపించదు.
అయితే ఈ కాలంలో గర్భిణులు బయటకు రాకూడదని పండితులు తెలిపారు. గర్భంలో ఉన్న శిశువుకు మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. కానీ వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ దీనిని అందరూ కచ్చితంగా పాటిస్తారు.