ఇరాన్‌ను భారీ దెబ్బ తీసిన ఇజ్రాయెల్

ఇరాన్‌కు ఇజ్రాయెల్ భారీ షాక్ ఇచ్చింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనికి అత్యంత సన్నిహితుడు, ఇరాన్‌ ఖుద్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఇస్మాయిలీ ఖానీని ఇజ్రాయెల్ హతం చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

New Update

Iran Vs Israel: ఇరాన్‌ను ఇజ్రాయెల్ భారీ దెబ్బ తీసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనికి అత్యంత సన్నిహితుడు, ఇరాన్‌ ఖుద్స్‌ ఫోర్స్‌ చీఫ్‌ ఇస్మాయిలీ ఖానీ హతం అయ్యాడు. ఇటీవల బీరుట్‌పై జరిపిన దాడుల్లో ఖానీ హతమైనట్లు సమాచారం. ఇరాన్‌ తరఫున విదేశాల్లో ఖుద్స్‌ఫోర్‌ ఆపరేషన్స్‌ చేసింది. హెజ్బుల్లాకు సాయం చేసేందుకు బీరుట్‌కు ఖుద్స్ ఫోర్స్ కమాండర్ వెళ్లినట్లు తెలుస్తోంది.
 
ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు చేసిన దాడుల్లో ఇస్మాయిలీ ఖానీ హతమైనట్లు పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. నస్రుల్లా మరణం తర్వాత హెజ్బుల్లా కార్యాలయానికి ఇస్మాయిలీ ఖానీ వెళ్లినట్లు సమాచారం. హెజ్బుల్లా నూతన చీఫ్‌గా భావిస్తున్న హసీమ్ సఫీద్దీన్‌తో ఇస్మాయిలీ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దాడి చేసినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనికి అత్యంత సన్నిహితుడిగా ఇస్మాయిలీ ఉన్నారు.

ఇజ్రాయెల్ దాడిలో 26మంది మృతి

హమాస్ గాజాపై ఇజ్రాయెల్ చేసిన తాజా దాడిలో ఓ మసీదులో 26మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్ తెలిపింది. డెయిర్ అల్-బలాలో ఉన్న ఆ మసీదులో శరణార్థులు తల దాచుకున్నారని పేర్కొంది. అనేకమంది తీవ్రగాయాలపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. అటు ఇజ్రాయెల్ ఆ ప్రకటనను ఖండించింది. హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని తాము అత్యంత కచ్చితత్వంగా గుర్తించి ధ్వంసం చేశామని, అందులో హమాస్ కమాండ్ సెంటర్ ఉందని పేర్కొంది.

#iran-vs-israel #iran-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe