బంకర్-బస్టర్ బాంబ్.. హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ భయంకర విధ్వంసం!

హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ భయంకర విధ్వంసానికి పాల్పడుతోంది. హసన్ నస్రల్లాను హతమార్చేందుకు 85 బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. ఇవి 30 నుంచి 60 అడుగుల భూగర్భంలో ప్రభావం చూపిస్తాయి. వియత్నాం యుద్ధంలో ఎక్కువగా వీటిని ఉపయోగించారు. 

Israel
New Update

Israel : హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ భయంకర విధ్వంసానికి పాల్పడుతోంది. హెజ్‌బొల్లా నాయకుడు హసన్ నస్రల్లా హతమైన రోజున 80 నుంచి 85 బంకర్ బస్టర్ బాంబులను హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ జారవిడిచింది. ఈ బాంబు పడినచో భూమిలో 30 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడటం సంచలనం రేపుతోంది. ఇవి నిజానికి మామూలు బాంబులు కావు. భూగర్భంలో 30 నుంచి 60 అడుగుల లోతులో ఉన్న బంకర్లను కూడా ధ్వంసం చేయగల సామర్థ్యం వీటికి  ఉంటుంది. అలాంటి బాంబులను ఇజ్రాయెల్ వాడటంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

జెట్‌లతో బీరుట్‌పై మెరుపు దాడి..

ఈ మేరకు 2024 సెప్టెంబర్ 27న ఇజ్రాయెల్ వైమానిక 69వ స్క్వాడ్రన్ దళం F-15I ఫైటర్ జెట్‌లతో బీరుట్‌పై మెరుపు దాడి చేసింది. దాదాపు 80-85 బంకర్ బస్టర్ బాంబులు ఆకాశం నుండి జారవిడిచింది. ఇందులో కొన్ని GBU-72, మరికొన్ని MK-84 సిరీస్ బాంబులున్నాయి. ఇది నేలపై పేలిన సాధారణ బాంబు కాదు. అవి భూగర్భంలోకి చొచ్చుకుపోయిన తర్వాత పేలిపోతాయి. ఇవి నేలపై కాకుండా భవనం లేదా బంకర్‌పై పడవేస్తే విధ్వంసం భయంకరంగా ఉంటుంది. నస్రల్లా ఉన్న భవనంపై బాంబు పడటంతో 30 అడుగుల లోతైన గొయ్యి ఏర్పడింది. ఈ GBU-72 బంకర్ బస్టర్ బాంబులు మందపాటి స్టీల్, కాంక్రీట్ గోడలను బద్దలు కొట్టగలవు. 30 నుంచి 60 అడుగుల లోతులోనూ ప్రభావం చూపిస్తాయి. 

హమాస్ భూమిలోపల సొరంగాలు నిర్మించింది. హిజ్ బొల్లా నివాస ప్రాంతాల మధ్య తమ ఆయుధ స్థావరాలను నిర్మించింది. లాంచ్ ప్యాడ్‌లను తయారు చేశారు. హిజ్ బొల్లా సామాన్య ప్రజల మధ్య ఉగ్రవాదులకు అడ్డాగా ఉండేది. దీంతో గాజాలోని సొరంగాలను ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ ఈ బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించింది. హసన్ నస్రల్లా ఉన్న భవనం భూగర్భంలో ఉండటంతో ఇజ్రాయెల్ దాని చుట్టుపక్కల బ్లాక్‌లలో 80-85 బంకర్ బస్టర్ బాంబులను జారవిడిచింది. భూగర్భంలో నిర్మించిన లోతైన స్థావరాలు దెబ్బతీసేందుకు ప్లాన్ చేసింది. 

GBU-72 బంకర్ బస్టర్ బాంబ్ ఫీచర్లు.. ఎలా పని చేస్తాయి? 


ఇక GBU-72 అనేది 2268 కిలోల బరువున్న అత్యాధునిక గైడెడ్ బాంబు. వాస్తవానికి ఇది బంకర్లు లేదా సొరంగాలను పేల్చివేయడానికి మాత్రమే రూపొందించబడింది. ఈ బాంబు మొదట భూమిలో రంధ్రం చేస్తుంది. తర్వాత కొన్ని అడుగుల లోపలికి వెళ్లి పేలిపోతుంది. ఒక భవనంపై పడితే అది దాని పునాదిని కదిలిస్తుంది.  బంకర్ బస్టర్ బాంబులు చాలా శక్తివంతమైన, భయంకరమైన ఆయుధాలు. కాంక్రీటు, బంకర్లు లేదా సొరంగాలతో చేసిన పునాదులను పేల్చివేయగలవు. ఈ రకమైన బాంబును వియత్నాం యుద్ధంలో ఎక్కువగా ఉపయోగించారు.  

ఈ బాంబు ముక్కు రూపంలో తయారు చేయబడింది. తద్వారా అవి వాటి బరువు, గురుత్వాకర్షణను కంట్రోల్ చేసుకుంటాయి. దీనికి రెండు ఛార్జీలు ఉన్నాయి. మొదటిది చిన్నది. ఇది ఎంచుకున్న లక్ష్యంలో రంధ్రం చేస్తుంది. రెండవది పెద్దది. భూభాగం లోపలికి వెళ్లి భయంకరమైన పేలుడుకు కారణమవుతుంది.

Also Read :  కుంటలో రేవంత్ ఇల్లు.. ముందు దాన్ని కూల్చుకో: బాంబు పేల్చిన హరీశ్ రావు!

#israel-attack #hezbollah #hamas-israel
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe