GAZA: గాజాలో దాడులు ఆపని ఇజ్రాయెల్...తాగునీరే ఆయుధంగా..

యుద్ధాన్ని అయితే ఆపింది కానీ గాజాలో ప్రజలను హింసించడం మాత్రం మానలేదు ఇజ్రాయెల్ సైన్యం. అక్కడ జనాలకు తారు నీరు అందించకుండా మారణ హోమం సృష్టిస్తోందని నివేదికలు చెబుతున్నాయి. పాలస్తీనియన్లకు సరిపడా మంచినీరు అందకుండా ఇజ్రాయెల్‌ అడ్డుపడుతోంది.

New Update
1

2023 అక్టోబర్‌‌లో ఇజ్రాయెల్ లో హమాస్ మారణకాండ మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఇజ్రాయెల్ పాస్తీనియుల ఈద పగబట్టింది. హమాస్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉంది. దాదాపు ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధంలో హమాస్ ఉగ్రవాదులతో పాటూ ఎంతో మంది పాలస్తీనియులు ప్రాణాలు కోల్పోయారు. బతికి ఉన్నవారు కూడా ఎందుకు ఉన్నామనే అనే స్థితిలో ఉన్నారు. ఇజ్రాయెల్ దాడులు కారణంగా గాజా సర్వనాశన అయిపోయింది. ఇప్పటిలో కోలుకుంటుందనే ఆశ కూడా లేదు. ప్రస్తుతం అక్కడ ప్రజలు ఆహారం, ఆరోగ్యం లేక విలవిల్లాడుతున్నారు. వీరికి కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీనికి కారణం ఇజ్రాయెల్ అని చెబుతున్నారు. గాజా ప్రజలకు కనీసం మంచినీరు కూడా అందకుండా చేస్తోందని నివేదికలు చెబుతున్నాయి. తాగునీటిని కూడా అడ్డం పెట్టుకొని గాజాలో మారణహోమం సృష్టిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గాజాలోని పాలస్తీనియన్లకు సరిపడా తాగునీరు అందకుండా ఇజ్రాయెల్‌ అడ్డుపడుతోందని అమెరికాకు చెందిన హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌  ఆరోపించింది. అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధించినప్పుడే సమస్య పరిష్కారమవుతుందని చెబుతోంది. 

ఏడాదిన్నరగా ప్రతీకారం..

2023లో దాడులు ప్రారంభం అయిన దగ్గర నుంచి ఈ తాగునీటి సమస్య ఉందని నివేదికలు చెబుతున్నాయి. అప్పటి నుంచే మంచి నీరు ఇవ్వకుండా ఇజ్రాయెల్ మారణకాండ సృష్టిస్తోందని అంటున్నాయి. గాజాలోని తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఇజ్రాయెల్‌ నుంచే పైప్‌ లైన్‌ ద్వారా నీరు రావాలి. దాడుల్లో భాగంగా నీటికి కోత విధిస్తూ ఇజ్రాయెల్‌ పరోక్షంగా పాలస్తీనియన్లపై ప్రతీకారం తీర్చుకుంటోంది. దీనిపై 184 పేజీల నివేదికను వెలువరించారు హెచ్‌ఆర్‌డబ్ల్యూ డైరెక్టర్‌ లామా ఫకి. ఐక్యరాజ్యసమితి ఏజెన్సీల ద్వారా మానవతా సాయం కింద గాజా స్ట్రిప్‌లోని ప్రజలకు అందించే మంచినీటి పరికరాలను కూడా ఇజ్రాయెల్‌ అడ్డుకుంటోందని ఆయన చెబుతున్నారు.  అక్కడి నీటి సరఫరా వ్యవస్థలను నాశనం చేస్తోంది. తద్వారా కృత్రిమ నీటి కొరతను సృష్టిస్తోంది. ఐడీఎఫ్‌ దళాలు భారీ వాటర్‌ స్టోరేజీలను, రిజర్వాయర్లను నాశనం చేయడమే ఇందుకు నిదర్శనం అని లామా అంటున్నారు. 

ఎంత యుద్ధం జరిగినా, ఎలాంటి దాడులు చేస్తున్నా 1948 నాటి ఒప్పందం ప్రకారం.. ఇజ్రాయెల్‌ తాగునీరు ఇవ్వకపోవడం లాంటి చర్యలకు పాల్పడకూడదు. ఒక వేళ పాల్పడితే.. జాతి నిర్మూలన చర్యల కిందికే వస్తాయి. హామాస్ తమ మీద అటాక్ చేసిందని సాకును చూపిస్తూ, ఆత్మరక్షణ హక్కు అంటూ  ఏడాదిన్నరగా ఇజ్రాయెల్ ఈ చట్టాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. దీని మీద ఐసీజే కూడా స్పందించింది. మానవతా సాయం కింద గాజాలోని ప్రజలకు ప్రాథమిక అవసరాలు తీర్చేలా చర్యలు చేపట్టాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. కానీ ఆదేశం ఇవేమీ పట్టించుకోవడం లేదు. పిచ్చిపట్టినట్టు కక్ష సాధింపులు చర్యలు తీర్చుకుంటూనే ఉంది. 

Also Read: BIG BREAKING: పిఠాపురంలో TDP Vs జనసేన.. అలిగి వెళ్లిపోయిన వర్మ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు