Iran War : ఇరాన్ వ్యూహాత్మక యుద్ధం..శత్రుదేశాల ఖజానా ఖాళీ

అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. యుద్ధంలో శత్రుదేశాలను ముప్పుతిప్పలు పెడుతూ ఇరాన్ వ్యూహాత్మక యుద్ధం చేస్తుంది. తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తూ శత్రువుల ఖజానా ఖాళీ చేస్తుంది. అట్రిషన్‌వార్‌ ప్లాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపిస్తుంది.

New Update
US and Iran in a War of Attrition

US and Iran in a War of Attrition

 Iran War : అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అదే సమయంలో యుద్ధంలో శత్రుదేశాలను ముప్పు తిప్పలు పెట్టడానికి ఇరాన్ వ్యూహాత్మకంగా యుద్ధం చేస్తుంది. తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తూ శత్రువుల ఖజానా ఖాళీ చేస్తుంది. అట్రిషన్‌ వార్‌ ప్లాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ చుక్కలు చూపిస్తుంది. శత్రుదేశాలపై ఇరాన్ షాహెద్‌-136 వన్‌ వే అటాక్‌ డ్రోన్లను ప్రయోగిస్తున్నది. షాహెద్‌ డ్రోన్స్ చిన్న క్రూయిజ్‌ మిస్సైళ్లలా పనిచేస్తాయి. అవి ప్రయోగించిన తర్వాత లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే పేలిపోతాయి. ఈ ఒక్కో డ్రోన్‌ తయారీ ఖర్చు కేవలం రూ16 లక్షలు మాత్రమే కాగా ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు గల్ఫ్‌ దేశాలు, అమెరికా వినియోగిస్తున్న రక్షణ క్షిపణుల ఖర్చు రూ.కోట్లల్లో ఉంటుంది. 

ఇరాన్ పై ఇజ్రాయెల్‌ ప్రయోగిస్తున్న ఒక్కో క్షిపణి 35-45 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇక విమానాలతో ప్రయోగించే సైడ్‌వైండర్‌ క్షిపణుల ధర ఇంకా ఎక్కువే. అమెరికా ప్రయోగిస్తున్న ఒక్కో ఇంటర్‌సెప్టర్‌ క్షిపణి ధర రూ.30 కోట్లకు పైనే ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంటే రూ.16 లక్షల డ్రోన్‌ను కూల్చేందుకు రూ.30 కోట్ల క్షిపణిని ప్రయోగిస్తున్నారు. ఇదే ఇప్పుడు యుద్ధంలో ఇంట్రెస్టింగ్‌ అండ్ ఫైనాన్షియల్‌ టెన్షన్‌ పాయింట్‌. యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశాలన్నాయి.

అదే సమయంలో నేను ఏమైనా పర్వాలేదు ప్రత్యర్థి మాత్రం నాశనం కావాల్సిందే  అనే ఫార్ములాతో ఇరాన్ భయంకర యుద్ధం చేస్తుంది.ఇప్పటికే గల్ఫ్‌లో కొన్ని దేశాల్లో ఆర్థిక నిల్వలు తగ్గుతున్నాయని తెలుస్తోంది. ఇరాన్ మాత్రం తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తూ ఇతర దేశాలకు చుక్కలు చూపిస్తుంది. ఇజ్రాయెల్‌-అమెరికా మాత్రం ఆర్థిక భారంతో యుద్ధం చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ఆ రెండు దేశాలకు చివరకు ఆయుధాల కొరత, రాజకీయ ఒత్తిడి కారణంగా యుద్ధాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చంటున్నారు విశ్లేషకులు.

ఇరాన్‌తో చేస్తున్న యుద్ధం కారణంగా అమెరికా భారీ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తోంది. యుద్ధం ప్రారంభం అయిన మొదటి 24 గంటల్లో అమెరికా ఏకంగా 779 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిందట.  అంటే మన ఇండియన్ కరెన్సీలో 6,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇలాగే యుద్ధం కొనసాగితే అమెరికా రోజుకు కనీసం రూ.58 కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు