BIG BREAKING  : డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన ..  ఇరాన్ సుప్రీం లీడర్ ఖతం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినట్లుగా ఆయన వెల్లడించారు.

New Update
iran

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇస్లామిక్ రిపబ్లిక్ పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినట్లుగా ఆయన వెల్లడించారు. 79 ఏళ్ల రిపబ్లికన్ నాయకుడు ఖమేనీని ప్రపంచ చరిత్రలో అత్యంత దుర్మార్గుడు అని అభివర్ణించిన ట్రంప్, ఖమేనీ హత్య ఇరాన్ ప్రజలకు మాత్రమే కాకుండా, అతని పాలనలో చంపబడిన వారికి కూడా న్యాయం చేసిందని అన్నారు. 

నలుగురు చనిపోయినట్లుగా ఇరాన్ మీడియా

అయతుల్లా అలీ ఖమేనీతో పాటుగా ఆయన కుటుంబంలోని నలుగురు చనిపోయినట్లుగా ఇరాన్ మీడియా తెలిపింది. ఆయన కూతురు, అల్లుడు,  కోడలు, మనవడు చనిపోయినట్లుగా  తెలిపింది. ఈ జాయింట్ అపరేషన్ లో భాగంగా ఖమేనీ ఇంటిపై 30 బాంబులు వేసినట్లుగా తేలింది. ఇందుకోసం ఇజ్రాయిల్ కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తోందని, అగ్రనేతలు ఒకే దగ్గర ఉండగా అటాక్ చేసిందని వెల్లడించింది. సుప్రీం లీడర్ మరణానికి సంబంధించి ఇరాన్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 అలీ ఖమేనీ ఏప్రిల్ 19, 1939న ఇరాన్‌లోని మష్హాద్‌లో ఇస్లామిక్ పండితుడు సయ్యద్ జావద్ ఖమేనీకి జన్మించారు.  1989లో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఖమేనీ అనేక పదవులను నిర్వహించారు, వాటిలో 1981లో మొహమ్మద్ అలీ రాజాయ్ మరణం తర్వాత దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు, ఆ పదవిని నిర్వహించిన మొదటి మతాధికారిగా ఆయన నిలిచారు.

Advertisment
తాజా కథనాలు