Ahmad Vahidi : ఇరాన్ కొత్త IRGC చీఫ్ అహ్మద్ వాహిదీ .. ఇంతకీ ఎవరీయన?

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. తాజాగా ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీని నియమించింది.

New Update
iran (1)

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. తాజాగా ఇరాన్ శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిదీని నియమించింది. ఈ పరిణామం పశ్చిమ ఆసియాలో యుద్ధం మరింత ముదిరే సూచనలను కనిపిస్తోంది.

కొత్త IRGC చీఫ్ అహ్మద్ వాహిదీ: ఎవరీయన?

అహ్మద్ వాహిదీ ఇరాన్ రక్షణ వ్యవస్థలో మోస్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ అండ్ డేంజరస్ పర్సన్. ఈయన గతంలో ఇరాన్ రక్షణ మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా, విదేశాల్లో ఆపరేషన్లు చేసే ఖుద్స్ ఫోర్స్ కు ఈయనే వ్యవస్థాపక కమాండర్. గెరిల్లా యుద్ధ తంత్రాలలో, క్షిపణి ప్రయోగాల్లో ఈయనకు తిరుగులేదు. ఖమేనీ మరణం తర్వాత చెల్లాచెదురైన సైన్యాన్ని ఏకం చేసి, అమెరికా-ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవడమే ఈయన ముందున్న ఏకైక లక్ష్యం.

భయంకరమైన హెచ్చరిక

మరోవైపు కొత్త కమాండర్ నియామకం జరిగిన వెంటనే IRGC ఒక భయంకరమైన హెచ్చరికను జారీ చేసింది. ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా, అత్యంత భారీ స్థాయిలో ఆఫెన్సివ్ ఆపరేషన్ మొదలుపెట్టబోతున్నాం. ఇజ్రాయెల్‌తో పాటు ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలే మా తదుపరి లక్ష్యమని ప్రకటించింది. 

తాజా సమాచారం ప్రకారం, ఆదివారం ఉదయం దుబాయ్‌లోని అమెరికా గూఢచారి సంస్థ CIA కి చెందిన ఒక కార్యాలయంపై ఇరాన్ క్షిపణి దాడి జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దీనివల్ల ఎంత నష్టం జరిగిందనేది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, యుద్ధం ఇప్పుడు కేవలం ఇరాన్-ఇజ్రాయెల్ మధ్యే కాకుండా గల్ఫ్ దేశాలన్నిటికీ పాకిందని అర్థమవుతోంది.

క్లిష్ట సమయంలో అనుభవం ఉన్న వాహిదీని నియమించడం అంటే, ఇరాన్ శాంతి చర్చల కంటే యుద్ధం వైపే మొగ్గు చూపుతోందని అర్థం.అమెరికా స్థావరాలను టార్గెట్ చేయడం ద్వారా యుద్ధాన్ని ప్రపంచవ్యాప్తం చేసే ప్రమాదం ఉంది. కాగా గల్ఫ్ దేశాల్లోని విమానాశ్రయాలు, పోర్టులపై దాడులు జరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు