Iran: ఇజ్రాయెల్‌పై భారీ దాడులకు ఇరాన్ స్కెచ్ వేస్తోంది. అమెరికా ఎన్నికలకు ముందు భారీ దాడులు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇజ్రాయెల్‌కు సహకరిస్తున్న అమెరికాపై కోపంతో రగిలిపోతున్న ఇరాన్.. సరిగ్గా ఎన్నికల ముందు అణుబాంబు దాడులు చేసి భారీ దెబ్బతీయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా..
ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాల ప్రకారం.. ఇజ్రాయెల్ దాడులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరించగా.. ఇజ్రాయెల్‌పై అణుబాంబు వేయాలా..? లేక రాకెట్ల దాడులకు పాల్పడాలా..? అని ఇరాన్ యోచిస్తోంది. గాజాపై యుద్ధం కారణంగా 40 వేల మంది మరణించగా.. లెబనాన్‌పై యుద్ధానికి ఇజ్రాయెల్‌కు అమెరికా సహకారం అందిస్తోంది. ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా, ఆర్థికంగా అండగా నిలుస్తోంది. దీంతో ఎన్నికల ముందు ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తే.. ఇజ్రాయెల్‌కు సహకరించిన డెమోక్రటిక్ పార్టీకి డ్యామేజ్ అవుతుందని ఇరాన్ భావిస్తోంది.