Pakistan : పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. బిగ్ షాకిచ్చిన ఐదు దేశాలు!

పాకిస్తాన్‌కు విదేశీ విమానయాన సంస్థలు బిగ్ షాక్ ఇస్తున్నాయి.  బ్రిటన్,ఫ్రాన్స్, ఒమన్‌ ఎయిర్ లైన్స్ వంటి సంస్థలు  పాక్‌ మీదుగా అంతర్జాతీయ విమానాలను నిలిపివేశాయి.  పాక్ గగనతలం మీదుగా విమానాలు వెళ్లకూడదని నిర్ణయం  తీసుకున్నాయి.

New Update

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు విదేశీ విమానయాన సంస్థలు బిగ్ షాక్ ఇస్తున్నాయి.   బ్రిటన్,ఫ్రాన్స్, ఒమన్‌ ఎయిర్ లైన్స్ వంటి సంస్థలు  పాక్‌ మీదుగా అంతర్జాతీయ విమానాలను నిలిపివేశాయి.  

పాక్‌కు వేలకోట్ల నష్టం

పాక్ గగనతలం మీదుగా విమానాలు వెళ్లకూడదని నిర్ణయం  తీసుకున్నాయి.  భారత్‌, పాక్ ఉద్రికత్తల నేపథ్యంలో ఓవర్ ఫ్లైట్ సర్వీసు కూడా రద్దు అయింది. విమాన సర్వీసుల రద్దుతో పాక్‌కు వేలకోట్ల నష్టం వాటిల్లుతుంది.  గతంలో గగనతలంలో తిరిగిన విమానాలకు భారీ ఛార్జీలు వసూలు చేసింది పాక్‌.  కాగా ఇప్పటికే భారత్, స్విట్జర్లాండ్, ఇటలీ, పోలండ్ దేశాల విమానాలు  పాక్ గగనతలం మీదుగా విమానాలను రద్దు చేసుకున్నాయి. కాగా దారుణంగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్​కు ఇది నిజంగా బిగ్ షాక్ అనే చెప్పాలి. 

పాకిస్తాన్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేసియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయ్ లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే భారత్ గగనతలాన్ని దాటాల్సిందే. కానీ ఇప్పుడు చైనా లేదా శ్రీలంక వంటి దేశాల మీదుగా పొడవైన మార్గాల్లో  విమానాలు పాకిస్తాన్ చేరుకోవాల్సి ఉంటుంది. ఇరాన్, అఫ్గానిస్తాన్, లేదా సెంట్రల్ ఆసియా దేశాల మీదుగా రీరూట్ చేయాల్సి ఉంటుంది. ఇది పాకిస్తాన్ కు జియోపొలిటికల్, లాజిస్టికల్ సవాళ్లను తెచ్చిపెడుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు