MEA: 398 భారతీయ సంస్థలపై అమెరికా ఆంక్షలు.. రష్యాతో దోస్తీయే కారణమా!?

భారత్‌కు చెందిన 398 సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. సంబంధిత అధికారులతోనూ చర్చలు జరుపుతున్నట్లు MEA తెలిపింది. రష్యాతో భారత్ స్నేహంగా ఉంటుందనే నెపంతో అమెరికా ఇలా చేసినట్లు తెలుస్తోంది.

author-image
By srinivas
AB
New Update

US sanctions: రష్యాతో స్నేహంగా ఉంటూ సైనిక సహాయం చేస్తుందనే నెపంతో భారత్‌కు చెందిన పలు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. అంతేకాదు ఇందుకు సంబంధించిన 398 సంస్థల జాబితాను రిలీజ్ చేసింది. అయితే ఈ ఇష్యూపై స్పందించిన భారత విదేశాంగ శాఖ.. ఆంక్షలపై అమెరికా అధికారులతోనూ చర్చలు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ పోర్ట్ కంట్రోల్ రూల్స్ పై భారతీయ కంపెనీలకు అవగాహన కల్పించేందుకు సంబంధిత విభాగాలు, ఏజెన్సీలతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

ఇది కూడా చదవండి: HYD: మెట్రో రెండోదశకు అనుమతులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

ఈ జాబితాలో డజను దేశాలు.. 

 చైనాతో ఒప్పందం ప్రకారం దెప్సాంగ్‌, డెమ్‌చోక్‌లలో పెట్రోలింగ్‌ మొదలైనట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. రష్యా, చైనా, భారత్‌తో పాటు మరో డజను ఇతర దేశాలకు చెందినవి ఈ జాబితాలో ఉన్నట్లు చెప్పింది. అమెరికా ఆర్థిక శాఖ విడుదల చేసిన లిస్టులో భారత్‌కు చెందిన అబార్‌ టెక్నాలజీస్‌ అండ్‌ సర్వీసెస్, డెన్వాస్‌ సర్వీసెస్, ఎమ్‌సిస్‌టెక్, గ్యాలక్సీ బేరింగ్స్‌ లిమిటెడ్, ఆర్బిట్‌ ఫిన్‌ట్రేడ్‌ ఎల్‌ఎల్‌పీ, ఇన్నోవియో వెంచర్స్, కేడీజీ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఖుష్బూ హానింగ్, లోకేశ్‌ మెషిన్స్‌ లిమిటెడ్, పాయింటర్‌ ఎలక్ట్రానిక్స్,శౌర్య ఏరోనాటిక్స్, శ్రీజీ ఇంపెక్స్, శ్రేయా లైఫ్‌ సైన్సెస్‌ ఆర్‌ఆర్‌జీ ఇంజినీరింగ్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, షార్ప్‌లైన్‌ ఆటోమేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ఉన్నట్లు విదేశాంగశాఖ తెలిపింది. 

ఇది కూడా చదవండి: రుషికొండ ప్యాలెస్ పై చంద్రబాబు సంచలనం నిర్ణయం.. ఏం చేయబోతున్నారంటే!

#america #india #mea
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe