Indian soliders At Lebanon Boarder:
లెబనాన్ సరిహద్దుల్లో బాంబుల వర్షం కురుస్తోంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం బీరుట్‌లో ఐరాస శాంతి పరిరక్ష దళాలు ఉన్న చోట కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తుండడమే. ఈ శాంతి పరిరక్షణ దళాల్లో 900మంది భారత సైనికులు కూడా ఉన్నారు. ఇప్పుడు వారి ప్రాణాలు రిస్క్‌లో ఉండటంతో భారత్ వర్రీ అవుతోంది. తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇద్దరు శాంతి పరిరక్షకులు గాయపడ్డారని..ఐక్యరాజ్యసమితి ప్రకటించింది కూడా.
ఈ వివాదం ప్రాంతీయ యుద్ధంగా మారకుండా చూడటం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడింది. అయితే, తాజా ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్, ఇరాన్‌తోపాటు ఇతర పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయులను తరలించే ప్రక్రియను ప్రస్తుతం చేపట్టడం లేదని భారత విదేశాంగశాఖ తెలిపింది. దక్షిణ లెబనాన్‌లోని ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యాలయంపై దాడులు జరగడం ఆందోళనకరమని భారత విదేశాంగశాఖ అభిప్రాయం వ్యక్తం చేసింది. లెబనాన్ సరిహద్దు అయిన బ్లూ లైన్లో భద్రతా పరిస్థితులు క్షీణించడం చాలా ఆందోళన కలిగిస్తోందని చెబుతోంది . పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. ఐరాస ప్రాంగణాలను అందరూ గౌరవించాలి. ఐరాస శాంతి పరిరక్షకులు, ఆ సంస్థ నిర్ణయాలను గౌరవించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ శాఖ కోరింది. దీనికి సంబంధించి ఓ ప్రకటనను విడుదల చేసింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇరాన్, ఇతర ప్రాంతాల నుంచి భారతీయులను తరలించడం కష్టమని..ప్రస్తుతానికి ఆ పని చేయడం లేదని తెలిపింది. కానీ వారిపట్ల తీవ్ర ఆందోళనలో అయితే మాత్రం ఉన్నామని స్పష్టం చేసింది.దీని గురించి ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలతో మాట్లాడుతున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
ఇరు పక్షాలు సంమయమనం పాటించాలని...పౌరులకు రక్షణ కల్పించాలని తాము పునరుద్ఘాటించామని తెలిపింది విదేశాంగ శాఖ. ఇది మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా..చర్చలు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని అన్నారు విదేశాంగ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్. యునైటెడ్ నేషన్స్ ఇంటరిమ్ ఫోర్స్ ఇన్ సౌత్ లెబనాన్ లో శాంతిపరిరక్షణ దళాల్లో..50 దేశాల నుంచి 10.500 మందితో కూడిన సైన్యం ఉన్నారు. ఇందులో భారత్‌కు చెందిన 900 మందితో కూడిన బెటాలియన్ అక్కడ పని చేస్తున్నారు.
Also Read: USA: మిల్టన్ దెబ్బకు కొట్టుకుపోయిన ఫ్లోరిడా తీర ప్రాంతాలు