/rtv/media/media_files/p90m4aS699gaCv7C2Ke4.jpg)
Milton Hurrican:
అనుకున్నట్టుగానే మిల్టన్ తుఫాను అమెరికాను అల్లకల్లోలం చేసింది. టోర్నడోలు సెయింట్ లూసీ కౌంటీని అతలాకుతలం చేశాయి. ఐదుగురు ప్రాణాలు పొట్టనుపెట్టుకున్నాయి. ఇక ఫ్లోరిడాలో సాగర తీరలో ఉన్న నగరాలన్ని తుఫాను ధాటికి విపరీతంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా అక్కడి విద్యుత్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో 30 లక్షల మంది అంధకారంలో కూరుకుపోయారు. ఎటుచూసినా నీరుతో ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి తుపాను తీరం దాటింది. కానీ ఇంకా ముప్పు పొంచే ఉందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Hampton Inn Panama City pic.twitter.com/xpxnF9fcba
— Mark Sudduth (@hurricanetrack) October 10, 2018
We love you, St. Pete. It’s been a tough few weeks, but we’re still with you - we’re ready to recover and rebuild.
— St. Petersburg, FL (@StPeteFL) October 10, 2024
City crews began accessing damage at daybreak and were encouraging all residents to stay off the roads until we deem it safe.#WeAreStPetepic.twitter.com/yIobPVLq2E
ఫ్లోరిడాలోని తాంపాలో గంటకు 205 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచాయి. భారీ వర్షం కురిసింది. చాలా ఇళ్ళు నేల మట్టం అయ్యాయి. ఫోర్ట్ మైయర్స్ లో టోర్నడాల దెబ్బకు చెట్లు కూలిపోయాయి. హార్డీ కౌంటీ, హైలాండ్స్ కౌంటీ, ఇంకా చాలా ప్రాంతాల్లో 90% మందికి విద్యుత్ అంతరాయం కలిగింది. సానిబెల్ నగరంలో రోడ్లన్నీ వరదతో ముంచెత్తాయి. రహదారులపై 3 అడుగుల మేర నీరు చేరింది. తుపాను ధాటికి చాలా మందే చనిపోయుంటారని...ఎంత నష్టం జరిగిందనేది ఇప్పుడే చెప్పలేమని అక్కడి అధికారులు అంటున్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో అత్యధికంగా 41 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురు గాలుల దెబ్బకు ఇళ్ళ పై కప్పులు లేచిపోయాయి. మంచి నీటి సరఫరా ఆగిపయింది. లోఇడాలో విమానాశ్రయాలు మూతబడ్డాయి. హెలెన్ హరికేన్ వేంటనే మిల్టన్ వరుసగా ఫ్లోరిడాను దెబ్బతీశాయి. ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తూర్పు తీరం వెంబడి తుఫాను ముప్పు ఇంకా ఉందని...ఈదురు గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు.
Hurricane Milton very close to making landfall! This video is from my friend Rob in Fort Myers, FL. They are expected to have 8-12 feet storm surge overnight. Yikes! 😳 pic.twitter.com/lOWljOzxS6
— Danielle Breezy (@DanielleBreezy) October 10, 2024
Also Read: హెజ్బుల్లా అంతమే టార్గెట్..ఇజ్రాయెల్ నెక్ట్స్ లేపేసేది అతడినే