ఇరాన్‌కు వెళ్లకండి.. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన మంగళవారం రాత్రి ఇరాన్.. ఇజ్రాయెల్‌పై దాదాపు 200 క్షిపణులతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలి భారత ప్రజలకు సూచనలు చేసింది. By B Aravind 02 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో మిడిల్ఈస్ట్‌లో అల్లకల్లోలం నెలకొంది. మంగళవారం రాత్రి ఇరాన్.. ఇజ్రాయెల్‌పై దాదాపు 200 క్షిపణులతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బుధవారం కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇరాన్‌కు అనవసర ప్రయాణాలు మానుకోవాలి భారత ప్రజలకు సూచనలు చేసింది. '' యుద్ధ ప్రాంతాల్లోని భద్రతా పరిస్థితులను మేము పరిశీలిస్తున్నాం. భారత ప్రజలు ఇరాన్‌కు అనవసర ప్రయణాలకు దూరంగా ఉండాలి. ఇప్పుడు ఇరాన్‌లో ఉంటున్నవారు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంప్రదింపులు జరపాలని పేర్కొంది. Also Read: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం చిన్న పిల్లల కొట్లాటల ఉంది: ట్రంప్ ఇరాన్ మూల్యం చెల్లించుకుంటుంది ఇదిలాఉండగా.. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. సోషల్ మీడియాలో కూడా వరల్డ్ వార్ 3 అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇజ్రాయెల్‌పై దాడి చేసి ఇరాన్ పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. త్వరలో ఇరాన్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. జెరుసలెంలోని అధికారుల భద్రతా కేబినేట్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఇరాన్ చర్యలపై మండిపడ్డారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన దాడి విఫలమైనట్లు పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత అధునాతన డిఫెన్స్ వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. అలాగే ఈ సమయంలో తమకు అండగా నిలిచిన అమెరికాకు నేతన్యూహు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇదిలాఉండగా ఇటీవల ఇజ్రయెల్ చేసిన దాడిలో హెజ్‌బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది జులైలో హమాస్ చీఫ్ ఇస్మాయెల్ హనియే కూడా మరణించారు. ఇలా పలువురు కీలక వ్యక్తుల్ని ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. అయినప్పటికీ గాజా, లెబనాన్‌పై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల లెబనాన్‌లో వాకీటాకీలు, పేజర్లు పేలిన ఘటన సంచలనం రేపింది. ఆ తర్వాత హెజ్‌బొల్లా అధినేత నస్రల్లా కూడా మరణించడంతో ఇరాన్.. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. Also Read: ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుళ్లు.. #telugu-news #israel #israel-iran-war మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి