బ్రిటన్‌ చర్చ్‌లో ఉగ్రదాడి.. టెర్రరిస్ట్‌తో సహా ముగ్గురు మృతి

మాంచెస్టర్‌లోని హీటన్ పార్క్ సినాగోగ్ వద్ద యోమ్ కిప్పుర్ ప్రార్థనల సమయంలో జరిగిన ఈ ఘోరమైన దాడి ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, అలాగే అనుమానిత ఉగ్రవాదిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు.

New Update
Manchester

ప్రపంచానికి అహింస సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ జన్మదినం, అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజే బ్రిటన్‌లో ఉగ్రదాడి కలకలం రేపింది. అయితే ఈ దాడిపై భారతదేశం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ఈ అకృత్యాన్ని తీవ్రంగా ఖండించింది. మాంచెస్టర్‌లోని హీటన్ పార్క్ సినాగోగ్ వద్ద యోమ్ కిప్పుర్ ప్రార్థనల సమయంలో జరిగిన ఈ ఘోరమైన దాడి ప్రపంచవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించారు, అలాగే అనుమానిత ఉగ్రవాదిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. ఈ ఘటన ఉగ్రదాడిగా గుర్తించారు. ఉగ్రవాది కారుతో వచ్చి రోడ్డు మీద ఉన్నవారిని ఢీకొట్టడంతో పాటు, సినాగోగ్ గేట్ వద్ద భద్రతా సిబ్బందిని కత్తితో పొడిచినట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు తెలిపారు.

ఈ దారుణ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. అక్టోబర్ 2, అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజున ఈ హేయమైన చర్య జరగడం మరీ విచారకరమని ఆయన అన్నారు. "మాంచెస్టర్‌లోని హీటన్ పార్క్ సినాగోగ్‌పై జరిగిన ఉగ్రదాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఉగ్రవాదమనే దుష్టశక్తుల నుండి ప్రపంచ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది మరోసారి తీవ్రమైన గుర్తు" అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈ ఉగ్రవాదాన్ని ఓడించడానికి ప్రపంచ అంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని జైస్వాల్ నొక్కి చెప్పారు. "బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ కష్ట సమయంలో యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజలకు భారతదేశం అండగా ఉంటుంది" అని ఆయన స్పష్టం చేశారు. మతం, ప్రాంతం తేడా లేకుండా ఉగ్రవాదం ఎక్కడ జరిగినా దానిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాలని భారత్ పిలుపునిచ్చింది. ఈ దాడిని ఇజ్రాయెల్, ఐక్యరాజ్యసమితి (UN)తో సహా యూకే నాయకులు కూడా తీవ్రంగా ఖండించారు. శాంతి, అహింస సిద్ధాంతాలను బోధించే మహాత్మా గాంధీ జయంతి రోజునే మతపరమైన ప్రార్థనా స్థలంపై ఉగ్రదాడి జరగడం ప్రపంచ మానవాళికి సిగ్గుచేటని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

Advertisment
తాజా కథనాలు