ICC ర్యాంకింగ్స్.. టాప్-5లో భారత్ నుంచి ఏకైక యంగ్ ప్లేయర్!

ICC టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. ఇంగ్లండ్‌ ప్లేయర్ జో రూట్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ నుంచి అన్ని ఫార్మాట్లలో టాప్-5లో యశస్వి జైస్వాల్ ఒక్కడే ఉన్నాడు. రోహిత్ 10, కోహ్లీ 12వ ర్యాంక్‌లో నిలిచారు. బౌలింగ్‌లో అశ్విన్ నెంబర్ 1స్థానంలో ఉన్నాడు.

tstgdftfg
New Update

Cricket: ICC టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ర్యాంక్స్ భారీగా పతనమవగా రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్ దూసుకెళ్లారు. ఇక టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఏకైక భారత బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్  నిలవడం విశేషం. కాగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 5 స్థానాలు పడిపోయి 716 పాయింట్లతో 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బంగ్లాతో మొదటి టెస్టులో విఫలమైన కోహ్లీ 5 స్థానాలు దిగజారి 709 పాయింట్లతో 12వ ర్యాంక్‌లో నిలిచాడు. 

రోహిత్, విరాట్ ర్యాంక్స్ పతనం..

ఇక ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ 899 పాయింట్లతో టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ 2వ స్థానంలో, విరాట్ కోహ్లీ 4వ స్థానంలో కొనసాగుతున్నారు. శుభ్‌మన్ గిల్ మూడవ స్థానంలో ఉండగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజం నంబర్‌ 1లో ఉన్నాడు. 

టీ 20లో సూర్య ఒక్కడే..

టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా ట్రావిస్ హెడ్ 881 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ 805 రేటింగ్‌తో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ మూడో స్థానంలో, భారత్‌కు చెందిన యశస్వి జైస్వాల్ 757 రేటింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 755 రేటింగ్‌తో ఐదో స్థానంలో ఉన్నాడు. 

బౌలింగ్‌ లో అశ్విన్ నెం 1.. 
టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 871 రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉన్నాడు. జస్ప్రీత్ బుమ్రా 854 రేటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే.. భారత ఆటగాడు కుల్దీప్ యాదవ్ 665 రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉన్నాడు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో ఉన్న ఏకైక భారతీయుడు కుల్దీప్. కాగా అంతర్జాతీయ టీ20 బౌలింగ్ టాప్-5 ర్యాంకింగ్స్‌లో భారత బౌలర్ ఎవరూ లేరు. 

#icc #test-ranking #india
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి