/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
BREAKING
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు మరోసారి కలకలం రేపాయి. ఆ దేశంలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మైనార్టీలపై జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి ఖోకోన్ దాస్‌పై కొందరు అల్లరి మూకలు దాడి చేసింది. ఈ దాడి తర్వాత 50 ఏళ్ల వ్యక్తిని దుందగులు నిప్పంటించారు. ఈ సంఘటన డిసెంబర్ 31న దేశంలోని షరియత్‌పూర్ జిల్లాలో జరిగింది.
Another attempt to burn a Hindu youth alive!
— Battalion71 🇧🇩 (@ImbusyWarrior) January 1, 2026
In Shariatpur, Khokan Chandra was first stabbed in the lower abdomen and then his body was set on fire with petrol. Khokan Chandra saved his life by jumping into a nearby pond.
This is how the silent genocide of minorities is going… pic.twitter.com/w9vBIEAIeT
దాస్ ఇంటికి వెళ్తుండగా ఒక గుంపు అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేసి, కొట్టి, నిప్పంటించారు. బంగ్లాదేశ్‌లో హిందువుపై జరిగిన నాల్గవ దాడి ఇది. డిసెంబర్ 24న, బంగ్లాదేశ్‌లోని కలిమోహర్ యూనియన్‌లోని హోస్సైన్‌డంగా ప్రాంతంలో 29 ఏళ్ల అమృత్ మండల్ అనే మరో హిందూ యువకుడిని ఒక గుంపు కొట్టి చంపిందని ఆరోపణలు ఉన్నాయి.
డిసెంబర్ 18న, మైమెన్‌సింగ్‌లోని భలుకా ఉపజిల్లాలోని తన కర్మాగారంలో ఒక ముస్లిం సహోద్యోగి తప్పుడు దైవదూషణ ఆరోపణలపై 25 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను మూక దాడి చేసి దారుణంగా చంపారు. ఆ గుంపు దాస్‌ను చంపి, ఆపై అతని మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీసి నిప్పంటించారు.
Follow Us