హీరోయిన్లు అంటే అంత చులకనా– సురేఖపై ప్రకాష్ రాజ్ మండిపాటు

ఏంటీ సిగ్గులేని రాజకీయాలు...సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా అంటూ నటుడు ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కొండా సురేఖ చేసిన సంచలన ఆరోపణలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. 

author-image
By Manogna alamuru
New Update
సిగ్గుందా! 🔴LIVE | Prakash raj Tweet On Konda Sureka | Samantha Naga Chaitanya | KTR | RTV

Prakash Raj Tweet on Sureka comments on Heroin: 

మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇద్దరూ ఒకరిని ఒకరు తీవ్రంగా దూషించుకుంటున్నారు. కేటీఆర్ మినిస్టర్ గా ఉన్న టైంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారన్నారు సురేఖ. ఆయనకు  తల్లి అక్కా, చెల్లి లేరా? అంటూ ఫైర్ ఆయ్యారు. కేటీఆరే మహిళలను కించపరిచేలా పోస్టులు తన టీమ్ కు చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు. దాంతో పాటూ గతంలో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, మంత్రి సీతక్కపై కూడా గతంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకరంగా పోస్టులు పెట్టిందని ఫైర్ అయ్యారు. ఇప్పుడు బీసీ మహిళ అయిన తనను కించపరుస్తూ పోస్టులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి కూడా కేటీఆర్ అని సంచలన ఆరోపణలు చేశారు సురేఖ. ఇంకా కొందరు హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకోవటానికి, సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు హీరోయిన్లు
బయటకు వెళ్ళిపోవడానికి గల కారణం కూడా కేటీఆర్ ఆరోపించారు. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసింది నువ్వే కదా అంటూ కేటీఆర్‌‌ను ప్రశ్నించారు. 

కేటీఆర్ స్పందన..

మంత్రి సురేఖ మాటలపై కేటీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి? అని ప్రశ్నించారు. కొండా సురేఖ గతంలో ఉచ్చ ఆగడం లేదా అని అనలేదా? అని అన్నారు. ఇంకా ఆమె గతంలో మాట్లాడిన బూతు మాటలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. ఈ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు ఎందుకు? అని ప్రశ్నించారు. గతంలో ఇదే కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు కావాలంటే పంపిస్తానన్నారు. హీరోయిన్ల ఫోన్లు టాప్ చేశారని ఆమె కామెంట్లు చేసిందని గుర్తు చేశారు. ఆమె ఆరోపణలు చేసిన వాళ్లు మహిళలు కాదా? వాళ్లకు మనోభావాలు ఉండవా? అని ధ్వజమెత్తారు. అడ్డగోలు ఆరోపణలు చేసినప్పుడు మా ఇంట్లో ఉన్న మహిళలు బాధపడ లేదా? వాళ్లు ఏడ్వరా?? అంటూ ప్రశ్నలు గుప్పించారు.

ప్రకాశ్ రాజ్ ట్వీట్..

ఇక దీనిపై నటుడు ప్రకాష్ రాజ్‌ కూడా స్పందించారు. మంత్రి మాటలపై అసహనం వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూపా అని ట్వీట్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ మండిపడ్డారు ప్రకాష్ రాజ్.

Advertisment
Advertisment
తాజా కథనాలు