Hezbollah:
లెబనాన్ (Lebanon) సాయుధ గ్రూప్ హిజ్బుల్లా సభ్యులు ఉపయోగించే వాకీ-టాకీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పేలడంతో కనీసం తొమ్మిది మంది మరణించారు. మరో 300 మందికి పైగా గాయపడ్డారు . దేశ రాజధాని బీరుట్‌లోని దక్షిణ ప్రాంతం మరియు శివారు ప్రాంతాల్లో ఈ పేలుళ్లు సంభవించాయి. మొట్టమొదట లెబనీస్ ఎంపీ అలీ అమ్మర్ కుమారుడు మహదీ అమ్మర్ అంత్యక్రియల్లో మొదటగా వాకీ టాకీ పేలింది. ఆ తరువాత వరుసగా ఎలక్ట్రానిక్ పరకరాలు పేలుతూనే ఉన్నాయి. నిన్న పేజర్ల వల్ల 15 మంది చనిపోగా..2,75 మంది గాయపడ్డారు. ఈరోజు 9మంది చనిపోగా..300మందికి గాయాలయ్యాయి. అయితే ఈ ఎలక్ట్రానిక్ పేలుళ్లు సాధారణ పౌరుల ఇళ్ళల్లో కూడా పేలుతున్నాఇ. దీంతో సామాన్య పౌరులు కూడా చనిపోతున్నారు, గాయపడుతున్నారు.
Also Read : బీజేపీకి వైసీపీ బిగ్ షాక్
గత ఏడాది అక్టోబర్‌లో గాజా (Gaza) యుద్ధం ప్రారంభమైన తర్వాత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని హిజ్బుల్లా చెప్పింది. దానికి బదులుగా టెలీ కమ్యూనికేషన్ సిస్టమ్ పై ఆధారపడాలని తన సభ్యులకు సూచించింది కూడా. ఇప్పుడు హిజ్బుల్లా అనుమానించినట్టే ఇజ్రాయెల్ ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా దాడులు చేస్తోంది అని అంటున్నారు. ప్రస్తుతం పేలుతున్న పేజర్లు కానీ, వాకీ టాకీలు అన్నీ హిజ్బుల్లా ఒకేసారి కొనుగోలు చేసింది. వీటిల్లో ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్ పేలుడు పదార్ధాలు అమర్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పేజర్లను వాకీ టాకీలను తాము తయారు చేయలేదని తైవానీస్ చెబుతోంది. ఇక ఈ ఎలక్ట్రానిక్ పరికరాల పేలుళ్ళకు ప్రతిదాడగా ఇజ్రాయెల్ ఆర్టిలరీ స్థానాల మీద రాకెట్లను ప్రయోగించామని హిజ్బుల్లా ప్రకటించింది. మొత్తానికి ఇది ఒక కొత్త యుద్ధానికి దారి తీస్తోందని ప్రపంచ దేశాలు అంటున్నాయి. దీనికి ఇరు వర్గాల నేతలు కూడా అవుననే అంటున్నారు.
Also Read : ఎంపీ విజయసాయి రెడ్డికి అధికారులు షాక్