Hezbollah: ఎవరు ఉన్నా లేకపోయినా తగ్గేదేలే– హెజ్బుల్లా కొత్త ఛీఫ్

ఎవరున్నా లేకపోయినా మా యుద్ధం ఆగేది లేదు అంటున్నారు హెజ్బుల్లా కొత్త ఛీఫ్ నైమ్ కసేమ్. ఇజ్రాయెల్‌తో దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమంటూ తన తొలి ప్రసంగంలో చెప్పారు. తమ ముఖ్య కమాండర్లను చంపి ఉండవచ్చు కానీ సైనిక సామర్ధ్యాన్ని నాశనం చేయలేకపోయారని అన్నారు. 

author-image
By Manogna alamuru
hezbollah
New Update

Hezbollah New Chief: 

ఇజ్రయెల్–హెజ్బుల్లా మధ్య యుద్ధం ఇప్పుడిప్పుడే ఆగేలా కనిపించడం లేదు. అంతేకాదు మరింత తీవ్రతరం అయేటట్టు కనిపిస్తోంది.  హెజ్బుల్లా ఛీఫ్ నస్రల్లా రెండు రోజుల క్రితం మరణించారు. దీని తర్వాత హెజ్బుల్లా తగ్గుతుందేమో అనుకున్నారు. కానీ అలా ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థకు కొత్త ఛీఫ్ నియమింపబడ్డారు. హెజ్‌బొల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌, తాత్కాలిక నాయకుడిగా నైమ్‌ కసేమ్‌ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన తొలిసారిగా ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. 

మరోవైపు ఇజ్రాయెల్ భూతల దాడులకు సిద్ధమవుతోంది. దీనికి హెజ్బుల్లా తాము కూడా రెడీ అంటోంది. మా కీలక కమాండర్లను చంపొచ్చు కానీ మా స్థావరాలను వారు నాశనం చేయలేకపోయారు. హెజ్బుల్లా సైనిక సామర్ధ్యం కూడా ఏ మాత్రం తగ్గలేదు. చనిపోయిన వారి స్థానంలో కొత్త వారిని భర్తీ చేశాం. మా ఉనికిని చాటుకునేందుకు , మా ప్రాంతాలను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ మీద పోరాటం కొనసాగిస్తామని హెజ్బుల్లా కొత్త ఛీఫ్ నైమ్ కసేమ్ చెప్పారు. సుదీర్ఘ యుద్ధానికి మా సంస్థ సిద్ధమైంది అని ప్రకటించారు. 

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య మొదలైన యుద్ధం...విస్తరిస్తూ పోతోంది. హమాస్‌ కు మద్దతుగా నిలిచిన హెజ్బుల్లా మీద దాడులు ప్రారంభించిది ఇజ్రాయెల్. దీనికి ఆ సంస్థ కూడా ధీటుగానే జవాబు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తమ సంస్థ ఛీఫ్ నస్రుల్లా మరికొంత మంది ముఖ్య కమాండర్లను హెజ్బుల్లా పోగొట్టుకుంది. కానీ తగ్గేదే లేదు అంటోంది అంటోంది హెజ్బుల్లా. చివరి వరకూ పోరాడుతూనే ఉంటాం అని చెబుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో  నస్రల్లా మరణించారని..మృతదేహాన్ని హెజ్‌బొల్లా స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే.. ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. బాంబుల వర్షం కురిసిన సమయంలో షాక్‌కి గురై ఆయన ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా 10 లక్షల మందికి పైగా తమ ప్రాంతాలను విడిచి వెళ్లినట్లు లెబానాన్‌ అధికారులు తెలిపారు.

 

Also Read: Stock Markets: ఒక్కసారిగా కుదేలైన మార్కెట్..3.5 లక్షల కోట్ల నష్టం

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe