Hezbollah Spoke Person:
ఇజ్రాయెల్ లెబనాన్, గాజాల మీద ఇంకా దాడులు చేస్తూనే ఉంది. తాజాగా జరిపిన దాడుల్లో హెజ్బొల్లాకు చెందిన కీలక ప్రతినిధి మరణించాడు. లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హెజ్‌బొల్లా ప్రధాన ప్రతినిధి మహమ్మద్ అఫిఫ్ మృతి చెందినట్లు సంబంధిత వర్గాలు ఓ వార్తాసంస్థకు తెలిపాయి. ఈ మధ్య కాలంలో సెంట్రల్ బీరుట్‌పై టెల్‌అవీవ్ సేనలు దాడి చేయడం ఇదే మొదటిసారి. మరోవైపు.. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించినట్లు పాలస్తీనా వైద్యాధికారులు తెలిపారు.
మహ్మద్ అఫిప్ చాలా ఏళ్ళుగా హెజ్బొల్లా మీడియా వ్యవహారాల బాధ్యత నిర్వర్తిస్తున్నారు. హెజ్బొల్లా అధనేత నస్రల్లా మరణం తర్వాత అఫిప్ ను మట్టుబెట్టాయి ఐడీఎఫ్ దళాలు. మిలిటెంట్లకు బలమైన స్థావరంగా ఉన్న బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలపైనా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. ఒకవైపు లెబనాన్ అధికారులు అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రతిపాదిస్తున్నాయి..మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం దాడులను కొనసాగిస్తోంది. అంతకుముందు ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలోని ప్రధాని నెతన్యాహు ఇంటిపై దాడి జరిగిన విషయం తెలిసిందే. రెండు ఫ్లాష్ బాంబులతో దాడి చేయగా.. అవి ఇంటి గార్డెన్‌లో పేలినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో నెతన్యాహు, ఆయన కుటుంబం ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ఎవరికీ ఏమీ జరగలేదు.
Also Read: Manipur: రగులుతున్న మణిపూర్...కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష