ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రతీకార దాడి.. వందల మంది మృతి!

ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. హైఫాపై 130కి రాకెట్లు, ‘ఫాది 1’ క్షిపణులు ప్రయోగించింది. ఈ  దాడుల్లో వంద మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా.. ఐదు ఐడీఎఫ్‌ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.

New Update
dedaa

Hizbullah- Isreal war: ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా యుద్ధం మరింత ముదిరింది. హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రుల్లా, నంబర్‌ 2 అఖిల్‌ను చంపిన ఇజ్రాయెల్‌పై రగిలిపోతున్న హెజ్‌బొల్లా సైన్యం ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. సోమవారం ఇజ్రాయెల్‌ మూడో అతిపెద్ద నగరమైన హైఫాపై రాకెట్లు, క్షిపణుల వర్షం కురిపించింది. ఉదయం లెబనాన్ నుంచి 130కి పైగా రాకెట్లతో ‘ఫాది 1’ క్షిపణులు ప్రయోగించింది. ఈ  దాడుల్లో వంద మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా.. ఐదు ఐడీఎఫ్‌ సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఐడీఎఫ్‌ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని హెజ్‌బొల్లా దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. 

బీరుట్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కాల్పులు..

మరోవైపు బీరుట్‌పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తోంది. బీరుట్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది.  ఓ మెయిన్‌ రోడ్డు, రెస్టారెంట్, ఇల్లు పూర్తిగా నేలమట్టం కాగా.. ఈ ఘటనలో పది మంది గాయపడినట్లు తెలుస్తోంది. లెబనాన్‌ నుంచి ఆదివారం రాత్రి   తమ భూభాగంలోకి వచ్చిన 130కిపైగా రాకెట్లను అడ్డుకున్నట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది.

పాఠశాలపై దాడి..

ఇదిలా ఉంటే.. గాజాలో హమాస్‌పై ఐడీఎఫ్‌ విరుచుకుపడుతోంది. దేర్‌ అల్‌-బలాహ్‌లోని ఓ మసీదు, ఓ పాఠశాలపై దాడి చేయగా 26 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. హమాస్‌ మిలిటెంట్లను లక్ష్యం చేసుకొని దాడులు చేసినటలు ఐడీఎఫ్‌ తెలిపింది. దక్షిణ ఇజ్రాయెల్‌లోని బీర్‌షెబా బస్టేషన్‌ దగ్గర ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఓ మహిళా పోలీసు అధికారి మృతి చెందగా 10 మందికి గాయాలయ్యాయి. 

అప్రమత్తమైన ఇరాన్..

ఇజ్రాయెల్‌ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్‌ అప్రమత్తమైంది. ఏ క్షణమైన ఇజ్రాయెల్‌ దాడి చేయొచ్చన్న అనుమానంతో ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు దేశంలోని విమాన సర్వీసులను రద్దు చేసింది. యుద్ధానికి ఏడాది పూర్తవుతున్న వేళ ముందుజాగ్రత్త చర్యగా ఇజ్రాయెల్‌లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. గాజా సమీప ప్రాంతాల్లో అదనపు దళాలను మోహరించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు