Israel: యహ్యా సిన్వార్ మృతి..ధృవీకరించిన ఇజ్రాయెల్

ఇజ్రాయిల్ మొత్తానికి అనుకున్నది సాధించింది. హమాస్కు గట్టి దెబ్బకొట్టింది. హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ ధృవీకరించింది.  ఐడీఎఫ్ దళాల చేతిలో సిన్వార్ చనిపోయాడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ప్రకటించారు.

hamas
New Update

Hamas Chief Yahya Sinwar: 

అనుమానాలు నిజమయ్యాయి.  ఐడీఎఫ్ దళాల చేతిలో హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందాడని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి తెలిపారు. ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు కూడా సిన్వార్‌ మృతిని ధ్రువీకరించారు. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల కుటుంబాలకు ఈ విషయాన్ని తెలియజేయాలని తన సిబ్బందికి సూచించారు. గత నెల గాజాలోని హమాస్ కమాండ్ సెంటర్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇందులో కమాండర్ సెంటర్ పూర్తిగా దెబ్బతింది. ఈ దాడిలోనే హమాస్ ఛీప్​ యహ్యా సిన్వార్ మృతి చెందారు. తమ దాడుల్లో ముగ్గురు మిలిటెంట్లు చనిపోయారని ఐడీఎఫ్ ప్రకటించింది. అయితే ఇందులో సిన్వార్ ఉన్నారా లేదా అనే విషయాన్ని పరీక్షించాల్సి ఉందని చెప్పారు. ఇప్పుడు డీఎన్ఏ పరీక్షల తర్వాత యహ్యా చనిపోయడని నిర్ధారించారు.

 

Also Read: ఒక్కడు కాదు చాలామందే..అమ్మవారిపై దాడి కేసులో సంచలన నిజాలు.

Also Read: మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్‌‌–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి

అసలీ ఎవరీ యహ్యా సిన్వార్..


ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ 7 నాటి ఘటనకు యహ్యా సిన్వారే సూత్రధారి. ఆ ఘటనలో హమాస్‌ తీవ్రవాదులు 1200 మంది ఇజ్రాయెల్‌ ప్రజలను చంపారు. అప్పటి నుంచి సిన్వార్‌ కోసం ఇజ్రాయెల్‌ వేట మొదలుపెట్టింది. యాహ్యా అసలు పేరు యహ్యా ఇబ్రహీం హస్సన్‌ సిన్వార్‌. ఇతను 1962లో గాజాలోని ఖాన్‌ యూనిస్‌లోని శరణార్థి శిబిరంలో పుట్టాడు. సిన్వార్ పూర్వీకులు 1948 వరకూ ఇజ్రాయెల్‌లోని అష్కెలోన్‌లో ఉండేవారు. ఆ తర్వాత సిన్వార్‌ కుటుంబం గాజాకు వెళ్ళిపోయింది. ఇక యహ్యా గాజా విశ్వవిద్యాలయం నుంచి అరబిక్‌ స్టడీస్‌లో డిగ్రీ పూర్తి చేశాడు.  సిన్వార్‌20 ఏళ్ళ పాటూ పాటు జైల్లో గడిపాడు. 1982లో విధ్వంసకర చర్యలకు పాల్పడుతున్న నేరం మీ మొదటిసారి అరెస్టయ్యాడు. 1985లో జైలు నుంచి విడుదలై.. మరొకరితో కలిసి మజ్ద్‌ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశాడు. అప్పుడే కొత్తగా ఏర్పడ్డ హమాస్ లో ఇది కీలక విభాగంగా మారింది. పాలస్తీనా ఉద్యమంలో ఉంటూ.. ఇజ్రాయెల్ తో బంధాలు పెట్టుకొన్నవారిని హత్య చేసినట్లు మజ్ద్‌ అభియోగాలు ఎదుర్కొంది. ఆ ఆరోపణలతోనే 1988లో అరెస్ట్‌ కాగా.. 1989లో యహ్యాకు జీవిత ఖైదు విధించారు. 

 

 

Also Read: హీరోయిన్ తమన్నా ఈడీ విచారణ..బెట్టింగ్ యాప్ కేసులో ప్రశ్నలు

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe