Hamas Chief Yahya Sinwar:
గత ఏడాది అక్టోబర్ లో మొదలైన ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో హెజ్బుల్లా మీద కూడా దాడులు చేస్తున్నా..హమాస్‌ను మాత్రం వదిలేయలేదు. ఈ నేపథ్యంలో అక్టోబరు 7 నాటి దాడుల రూపకర్త, హమాస్ అధినేత యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని వర్గాల యహ్యా ఇంకా బతికే ఉన్నారు అని చెబుతున్నారు. దీంతో ఆయన ఉనికి మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో యహ్యా సిన్వారా ప్రాణాలతో ఉన్నారా లేదా అనే దాని మీ ఇజ్రాయెల్ సైన్యం ఆరా తీస్తోంది.
Also Read: మళ్ళీ బాంబు బెదిరింపు..ఈసారి ముంబయ్–లండన్ ఎయిర్ ఇండియా విమానానికి
ఇజ్రాయెల్ దాడి..
గత నెల గాజాలోని హమాస్ కమాండ్ సెంటర్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇందులో కమాండర్ సెంటర్ పూర్తిగా దెబ్బతింది. ఈ దాడిలోనే హమాస్ ఛీప్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఐడీఎఫ్ సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దాడుల్లో ముగ్గురు మిలిటెంట్లు చనిపోయారని..అందులో సిన్వార్ ఉన్నారా..? అనే దానిపై ఆరా తీస్తున్నామని చెప్పింది. అయితే దాడి జరిగిన సమయంలో మిలిటెంట్లు ఉన్న భవనంలో బందీలు ఎవరూ లేరని తెలిపింది.
Also Read: మాతో పెట్టుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు–ఇరాన్ కమాండర్ వార్నింగ్
డీఎన్‌ఏ పరీక్ష..
యహ్యా సిన్వార్ మృతిపై హామాస్ మాత్రం ఏమీ చెప్పడం లేదు. దీని పై వార్తలు వస్తున్నా ఆ సంస్థ మాత్రం ఏం స్పందించడం లేదు. అయితే ఇజ్రాయెల్ మాత్రం కమాండ్ సెంటర్‌దాడిలో చనిపోయిన వారి మృతదేహాలను పరీక్షిస్తోంది. అప్పటి వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని.. చనిపోయిన వారిలో సిన్వార్ ఉన్నారా లేదా అనే విషయాన్ని డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిర్ధారిస్తామని ఐడీఎఫ్ సైన్యం చెప్పింది. హమాస్ అధినేత ఇజ్రాయెల్ జైల్లో ఉన్నప్పుడు అతడి జన్యు సంబంధిత ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని...రెండిటినీ పరీక్షించి నిజనిద్ధారణ చేస్తామని అంటోంది.
Also Read:IRCTC:ఐఆర్సీటీసీలో కీలక మార్పు..అడ్వాన్స్ బుకింగ్స్ 60 రోజులకు కుదింపు
ఇది కూడా చదవండి: TGPSC GROUP-1: గ్రూప్-1 మెయిన్స్ పై సీఎస్ కీలక ఆదేశాలు!