Gangster : పెద్దలను దోచి పేదలకు పెట్టాడు.. గ్యాంగ్ స్టర్ కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలకు లక్షలాది అభిమానులు

సహజంగా ఓ గ్యాంగ్ స్టర్ చనిపోతే అయితే  పీడ విరగడ అయిందని జనాలు ఎంతో సంతోషపడుతారు కానీ ముంబైలో ఓ గ్యాంగ్ స్టర్ చనిపోతే మాత్రం పోలీసులు కూడా కంట్రోల్ చేయనంతగా జనాలు గుమిగూడారు.

New Update
gang ster

సహజంగా ఓ గ్యాంగ్ స్టర్ చనిపోతే అయితే  పీడ విరగడ అయిందని జనాలు ఎంతో సంతోషపడుతారు కానీ ముంబైలో ఓ  గ్యాంగ్ స్టర్ చనిపోతే మాత్రం పోలీసులు కూడా కంట్రోల్ చేయనంతగా జనాలు గుమిగూడారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో లోకల్ హీరోగా పేరు తెచ్చుకున్న గ్యాంగ్‌స్టర్ సల్మాన్ లాలాకు మలక్‌పూర్ అనే చిన్న పట్టణానికి చెందినవాడు. ఈ పట్టణాన్ని మినీ ముంబై అని పిలుస్తారు. సల్మాన్ చిన్న చిన్న గ్యాంగ్‌స్టర్ గొడవల్లో పాల్గొంటూ, ఆర్థిక నేరాలకు పాల్పడుతూ వచ్చాడు. అయితే అతనికకి లోకల్ హీరోగా పేరు రావడం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. 

నిస్సహాయులకు ఆర్థిక సహాయం

సల్మాన్ లాలా తన పట్టణంలో పేదలకు, నిస్సహాయులకు ఆర్థిక సహాయం చేస్తూ వచ్చాడు.  వివాదాలను పరిష్కరించడంలో, పేదలకు సహాయం చేయడంలో అతడి పాత్ర వల్ల ప్రజల్లో అతనికి ఒకరకమైన అభిమానం ఏర్పడింది.  బాలీవుడ్ నుంచి కూడా అతనికి మద్దతు లభించడం ఆశ్చర్యానికి గురి చేసింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సల్మాన్ లాలా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఆ పోస్ట్ వివాదాస్పదం కావడంతో వివేక్ దాన్ని తొలగించాల్సి వచ్చింది. అయినప్పటికీ ఒక గ్యాంగ్‌స్టర్‌కు బాలీవుడ్ సెలబ్రిటీ మద్దతు ఇవ్వడం అనేది అందరినీ విస్మయపరిచింది. సల్మాన్ లాలా మృతి అనంతరం, అతని అంత్యక్రియల్లో వేల మంది గుమిగూడారు. కొందరు అతని సమాధిపై పూల దండలు, డబ్బులు వేసి నివాళులు అర్పించారు. పోలీసులు ఈ గుంపును నియంత్రించడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చట్టవిరుద్ధంగా గుమిగూడినందుకు గాను పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన ప్రభుత్వం, పోలీసులకు సవాలుగా మారింది.  

సల్మాన్ లాలా నెమ్మదిగా తన ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు.  మొదట అతను చిన్న చిన్న నేర కార్యకలాపాలలో పాల్గొన్నాడు, తరువాత అతని నెట్ వర్క్ బాగా పెరిగింది. గ్యాంగ్‌స్టర్ సల్మాన్ లాలాకు కేవలం 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతనిపై మూడు అత్యాచార కేసులు నమోదయ్యాయి. 28 సంవత్సరాల వయస్సులో, అతనిపై మొత్తం 32 కేసులు నమోదయ్యాయి. ఇందులో అనేక హత్య, మాదకద్రవ్యాల కేసులు కూడా ఉన్నాయి. అతని పేరు వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ, అతని నెట్‌వర్క్ మరింత బలపడుతూనే ఉంది. ఇప్పుడు పోలీసులు సోషల్ మీడియాలో సల్మాన్ లాలాకు ఉన్న ప్రజాదరణపై దృష్టి పెట్టారు.అతని ఇమేజ్‌ను ప్రచారం చేసే పేజీలు యువతను తప్పుదారి పట్టించవచ్చని భావించి 35 సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు గుర్తించి తొలిగించారు. 

Advertisment
తాజా కథనాలు