Telangana: స్వర్ణమయం కానున్న యాదాద్రి ఆలయ గోపురం

తిరుమల తరహాలో యాదాద్రి ఆలయాన్ని త్వరలో మార్చనున్నారు. ఈ గుడిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేషంగా అభివృద్ధి చేసింది. ఇప్పుడు ఈ గుడి గోపురాన్ని కూడా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల తరహాలో గోపురాన్ని స్వర్ణమయం చేయనుంది. 

author-image
By Manogna alamuru
New Update
Yadadri : యాదాద్రి ఆలయ ఇన్‌ ఛార్జ్‌ ఈవో పై బదిలీ వేటు!

Yadadri Temple: 

తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి తర్వాత అంతటి ప్రసిద్ధి పుణ్య క్షేత్రం యాదాద్రి. తెలంగాణలో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. ఇక్కడి నరసింహస్వామి మహిమలు గురించి ఎన్నో గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. యాదాద్రికి భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు ఇతర ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాదాద్రి పునర్నిర్మాణ చేసింది. పాత గుడిని మొత్తం మార్చేసింది. అలాగే యాదగిరి గుట్టగా ఉండే ఈ పుణ్యక్షేత్రం పేరును కూడా యాదాద్రిగా మార్చింది. 

ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యాదాద్రి గుడి మీద ఫోకస్ చేసింది. ఈ ఆలయానికి మరింత కొత్త రూపు ఇచ్చేందుకు రెడీ అయింది. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో.. ఆలయ విమాన గోపురాన్ని స్వర్ణమయం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఆకృతిని అధికారులు తాజాగా ఖరారు చేశారు. యాదాద్రి స్వర్ణతాపడం పనులపై సీఎం రేవంత్‌ ఆదేశాలతో ఇటీవలే దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష అధికారులతో నిర్వహించారు. దీంతో త్వరలోనే స్వర్ణ గోపురం పనులు మొదలబెట్టనున్నారని తెలుస్తోంది. 
అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం టైమ్‌లో విమాన గోపురం స్వర్ణతాపడాన్ని 127 కిలోల బంగారంతో చేయాలని నిర్ణయించారు కానీ ఇప్పుడు పలు కారణాలతో దాన్ని 65 కిలోలకు తగ్గించారు. స్వర్ణ తాపడం కోసం భక్తులు ఇప్పటి వరకు 11 కిలోల బంగారం సమర్పించారు. మరో రూ.20 కోట్ల నగదు కూడా సమకూరినట్లు ఆలయ అధికారులు చెప్పారు. ఈ బంగారు తాపడంపై పూర్తి వివరాలు ఒకట్రెండు రోజుల్లో వెల్లడవుతాయని యాదాద్రి దేవస్థానం అధికార వర్గాలు తెలిపాయి. 

పునర్నిర్మాణంలో  యాదాద్రి ఆలయం మొత్తం రూపరేఖు మార్చేశారు.  బాహ్య ప్రాకారంలో తిరు మాఢవీధులు, తూర్పు, ఉత్తరం, దక్షిణం, పడమర పంచతల రాజగోపురాలు నిర్మించారు. పడమర సప్తతల రాజగోపురంతోపాటు త్రితలం, విమాన గోపురాలను కృష్ణశిలలతో తీర్చిదిద్దారు. గతంలో ఆలయానికి ప్రాకారాలు లేకపోవటంతో కొత్తగా బాహ్య, అంతర ప్రాకారాలు నిర్మించారు. దాంతో పాటూ యాళీ పిల్లర్లు, అష్టభుజి మండపాలతో యాదాద్రి ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. స్వామివారికి ప్రత్యేక రథశాల, పడమర ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో వేంచేపు మండపం, తూర్పు ప్రాంతంలో బ్రహ్మోత్సవ మండపాన్ని నిర్మించారు. అలాగే గర్భాలయంలో ఆళ్వారులు, స్వర్ణకాంతులతో తీర్చిదిద్దిన ముఖ మండపం కూడా నిర్మాణం చేస్తున్నారు. 

 

Also Read: Israel: ఇజ్రాయెల్ ఎయిర్‌‌స్ట్రైక్..హమాస్ ఛీఫ్ హతం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు