Israel Defence Force:
గతేడాది అక్టోబర్ నుంచి ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంది. హమాస్‌తో మొదలైన వార్ ఇప్పుడు ఇరాన్ వరకూ వచ్చింది. అయితే ఇప్పటి వరకూ ఒక్కరినీ కూడా కోల్పోకుండా జాగ్రత్తగా ఉన్న ఐడీఎఫ్ సైన్యంలో మొదటి మరణం ఈరోజు సంభవించింది . లెబనాన్‌లో జరిగిన దాడిలో ఇజ్రాయెల్ సైన్యం.. ఒక వీరుడ్ని కోల్పోయింది. ఇజ్రాయెల్ సైన్యంలో తొలి మరణం జరిగిందని ఇజ్రాయెల్ మిలటరీ ప్రకటించింది. కెప్టెన్ ఈటాన్ ఇట్జాక్ ఓస్టర్ అనే సైనికుడు.. లెబనాన్‌తో జరిగిన యుద్ధంలో చనిపోయాడని ఐడీఎఫ్ తెలిపింది. దక్షిణ సరిహద్దు గ్రామంలోకి చొరబడిన ఇజ్రాయెల్ దళాలతో హిజ్బుల్లా యోధులు ఎదురుదాడులకు దిగినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పింది. ఈశాన్య సరిహద్దు గ్రామమైన అడేస్సేలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన తర్వాత ఇజ్రాయెల్ సైనికులు వెనక్కి వెళ్లిపోయారని వివరించింది.
హమాస్, హెజ్బుల్లా ఇలా ఒక్కొక్కరినీ మట్టు బెట్టుకు వస్తోంది ఇజ్రాయెల్. ఉగ్రవాదాన్ని అంతమొందించడమే తమ లక్ష్యమని చెబుతోంది. దీనికి అమెరికా వంటి అగ్రరాజ్యం సపోర్ట్ గా నిలుస్తోంది. అయితే ఐడీఎఫ్ లెబనాన్ పై చేస్తున్న దాడులు, హెజ్బుల్లా అధినేత నస్రల్లా మరణం తర్వాత పశ్చమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి. యుద్ధంలోకి ఇరాన్ కూడా వచ్చేసింది. ఇజ్రాయెల్ మీద ఒకేసారి దాదాపు 200 క్షిపణులను ప్రయోగించింది. వీటిని ఇజ్రాయెల్ సమర్ధవంతంగా అడ్డుకుంది. కానీ ఇరాన్‌ను వదిలిపెట్టమని ప్రకటించింది. మరోవైపు లెబనాన్‌లో ఐడీఎఫ్ పదాతి దళపతులతో ప్రత్యక్ష యుద్ధం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఒక సైనికుడిని కోల్పోయింది ఇజ్రాయెల్.