Elon Musk: అంతరిక్షంలో మస్క్ మామ.. మళ్లీ ఏం చేశాడో తెలుసా!?

ఎలన్‌ మస్క్‌ అంతరీక్ష ప్రయోగాల్లో కొత్త శకానికి నాంది పలికారు. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ప్యాడ్‌ దగ్గరకే సురక్షితంగా రప్పించి చరిత్ర సృష్టించారు. ఒక రాకెట్‌ బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ ప్యాడ్‌ వద్దకు తీసుకురావడం ఇదే తొలిసారి.

New Update

మనీ..! ఎవరు ఔనన్నా కాదన్నా ఈ ప్రపంచాన్ని శాసించిందే డబ్బే..! ఆ డబ్బు కోసం చేసే వ్యాపారం సైన్స్‌కు ఉపయోగపడితే అంతకంటే ఇంకేం కావాలి.. సరిగ్గా ఎలన్‌ మస్క్ చేస్తున్నది కూడా ఇదే..! గతంలో ఏ సంస్థ కూడా సాధించలేని విజయాలు సాధించాలని కంకణం కట్టుకున్న మస్క్‌.. అందుకు తగ్గట్టుగా వేగంగా అడుగుల వేస్తున్నారు. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ప్యాడ్‌ వద్ద సేఫ్‌గా ల్యాండ్‌ అవ్వడం అందరిని అబ్బురపరిచింది. దీని కారణంగా సైన్స్‌ మరో ముందడుగు వేసిందనే చెప్పాలి.. ఓ సారి గతేడాది ఇస్రో ప్రయోగించిన PSLV-C56 రాకెట్‌ ప్రయోగాన్ని.. నిన్నటికి నిన్న స్పేక్‌ ఎక్స్‌ ప్రయోగించిన రాకెట్‌ను కంపేర్ చేసి చూడండి..!

ఇది కూడా చదవండి: Canada: బుద్ధి పోనిచ్చుకోని కెనడా..అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త

సునీత విలియమ్స్ నెలలు గడస్తున్నా ఇంకా అక్కడే..

అంతరీక్ష ప్రయాణాలు ఎంతో సాహసంతో కూడుకున్నవి. 2024 జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన ఇద్దరు అమెరికన్ వ్యోమగాములు.. అక్కడే కొన్ని రోజులు గడిపి తిరిగి భూమిపైకి రావాల్సి ఉంది. అయితే, అన్నీ అనుకున్నట్లు జరగలేదు. బారీ విల్‌మోర్, సునీత విలియమ్స్ నెలలు గడస్తున్నా ఇంకా అక్కడే ఉన్నారు. బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్‌లైనర్ అనే వ్యోమనౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లేలా రూపొందించిన మొదటి స్పేస్ క్రాఫ్ట్ ఇది. ఈ కొత్త అంతరిక్ష వ్యౌమనౌక పనితీరును పరీక్షించడంలో భాగంగా వీరిద్దరినీ ఇందులో పంపించారు. అయితే నెలలు దాటుతున్నా ఇంకా వారు భూమిపైకి సురక్షతంగా చేరుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మస్క్‌కు చెందిన రాకెట్‌ బూస్టర్‌ సురక్షితంగా లాంచ్‌ ప్యాడ్‌పై ల్యాండ్‌ అవ్వడాన్ని సైన్స్‌ ప్రేమికులు చర్చించుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: USA: ఇజ్రాయెల్‌కు అమెరికా కీలక ఆయుధాలు

కల్పనా చావ్లా కథ విషాదాంతం..

ఇక భారత సంతతికి చెందిన తొలి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా కథ విషాదంతో ముగియడాన్ని ఎవరూ అంత ఈజీగా మర్చిపోరు. ఆమె ప్రయాణిస్తున్న కొలంబియా స్పేష్ షటిల్ ఆకాశంలోనే పేలిపోవడం సైన్స్‌ చరిత్రలో చీకటి ఆధ్యాయం. ఆ ఘటనలో ఆమెతో పాటూ మరో ఆరుగురు మరణించారు. ఈ ఘటన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు ఎన్నో పాఠాలు నేర్పింది. అయితే కేవలం ఇది నాసాకు మాత్రమే పాఠం కాలేదు.. ఆ తర్వాతి ఎలాంటి ప్రయోగాలు చేయాలన్న కొలంబియా స్పేష్ షటిల్ ఫెయిల్యూర్‌ని దృష్టిలో పెట్టుకోనే ప్రయోగాలు చేశారు సైంటిస్టులు. అటు మస్క్‌ తన బిజినెస్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఇలాంటి విషయాలన్నిటిని పరిగణనలోకి తీసుకున్నారు.. అందుకే ఇప్పుడాయన కంపెనీ చేపడుతున్న ప్రయోగాలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఏదో కారులోనో, బస్సులోనో వెళ్లి వచ్చినట్టుగా రాకెట్‌ బుస్టర్‌ ల్యాండ్‌ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇది కూడా చదవండి: Bomb Threat : బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్

టెక్సస్‌ తీరంలో ఈ ప్రయోగం నిర్వహించారు. అంతరిక్షంలోకి ప్రయోగించిన స్టార్‌షిప్‌ రాకెట్‌ పొడవు 121 మీటర్లు. ఇందులో బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌ అని రెండు విభాగాలుంటాయి. బూస్టర్‌ పొడవు 71మీటర్లు. ప్రయోగంలో భాగంగా రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించారు. కొద్దిసేపటి తర్వాత, బూస్టర్‌ నుంచి స్పేస్‌క్రాఫ్ట్‌ విడిపోయింది. స్పేస్‌క్రాఫ్ట్‌ను సముద్రంలో దింపేశారు. బూస్టర్‌ను మాత్రం లాంచ్‌ప్యాడ్ దగ్గరకు తిరిగి రప్పించారు. లాంచ్ ప్యాడ్ దగ్గర ఏర్పాటు చేసిన చాప్‌స్టిక్స్ బూస్టర్‌ను విజయవంతంగా ఒడిసిపట్టుకున్నాయి. చాలా మంది ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.

ఇది కూడా చదవండి: విచిత్రం.. ఎడారిలో పోటెత్తిన వరదలు.. భవిష్యత్తులో జరిగే పరిణామాలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు