Earthquake: ఓరి దేవుడా.. భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ - వణుకు పుట్టిస్తున్న వీడియోలు

అమెరికాలోని అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.3 తీవ్రతతో భూకంపం  సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

New Update
Earthquake

Earthquake

అమెరికాలోని అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రిక్టర్‌ స్కేల్‌పై 7.3 తీవ్రతతో భూకంపం  సంభవించిందని అధికారులు తెలిపారు. దీంతో అమెరికా జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. 

Earthquake alaska 

అయితే ఈ భూకంపం సమయంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. స్థానిక సమయం ప్రకారం (2037 GMT) సుమారు మధ్యాహ్నం 12:37 గంటలకు అక్కడ భూకంపం సంభవించింది. 

కాగా భూకంపం తర్వాత దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పానికి అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. దక్షిణ అలాస్కా, అలాస్కా ద్వీపకల్పం, అలాస్కాలోని కెన్నెడీ ఎంట్రన్స్ నుండి అలాస్కాలోని యూనిమాక్ పాస్ వరకు పసిఫిక్ తీరాలకు ఈ హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ముందస్తు జాగ్రత్తగా అధికారులు సూచించారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు